ETV Bharat / state

రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - 18న 'స్వచ్ఛ దివస్' - SWACHH ANDHRA PROGRAM IN AP

ప్రతి మూడో శనివారం ఏపీలో స్వచ్ఛ దివస్ కార్యక్రమం - 18న కడప జిల్లా మైదుకూరులో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

AP CS K.Vijayanand On Swachh Andhra –Swachh Divas programme
AP CS K.Vijayanand On Swachh Andhra –Swachh Divas programme (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 2:43 PM IST

AP CS Vijayanand On Swachh Andhra – Swachh Divas Programme: 'స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్' కార్యక్రమానికి కార్యాచరణను చేపట్టాలని సీఎస్ కె. విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్​ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేయాలని ఆయన సూచనలు జారీ చేశారు. దీనిని ప్రతి మూడో శనివారం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలకో థీమ్​తో 12 మాసాలకు 12 అంశాలతో కూడిన కార్యక్రమ నిర్వహణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వచ్ఛత కార్యక్రమాన్ని జనవరి 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు.

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం: దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్​ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ప్రతి శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని సీఎస్ విజయానంద్ అన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇకపై ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ భాగస్వామ్యులు కావాలని అందరికీ పిలుపునిచ్చారు.

అప్పుడు అలా, ఇప్పుడు క్యూ కట్టారు - ఆ ముగ్గురు ఐపీఎస్​లకు నో ఎంట్రీ! - IPS OFFICERS NOT ALLOWED TO Meet CBN

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​: సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ను నిర్వహించిన సీఎస్ విజయానంద్​ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలను ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు. స్వచ్ఛత కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ద చూపాలన్నారు.

సెలవుపై జవహర్‌రెడ్డి- సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం! - CS Jawahar Reddy

నెలకో థీమ్​తో వినూత్నంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్: జనవరి మాసంలో న్యూ ఇయర్ - క్లీన్ స్టార్ ధీమ్​తో, ఫిబ్రవరి మాసంలో సోర్సు-రిసోర్సు థీమ్​తో, మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ – ప్రమోట్ రీయూజబుల్స్ థీమ్​తో, ఏప్రిల్​లో ఇ-చెక్ థీమ్​తో, మేలో నీరు-మీరు థీమ్​తో, జూన్​లో బీట్ ది హీట్ థీమ్​తో, జులైలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్​తో, ఆగస్టులో మాన్ సూన్ హైజనిక్ థీమ్​తో, సెప్టెంబరులో గ్రీన్ ఏపీ థీమ్​తో, అక్టోబరులో క్లీన్ ఎయిర్ థీమ్​తోను, నవంబరులో పర్సనల్ కమ్యునిటీ హైజిన్ థీమ్​తో, డిసెంబర్​లో ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్​మెంట్​ థీమ్​తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం: పర్యావరణ పరిరక్షణ అంశంలో కమ్యునిటీ ఎంగేజ్​మెంట్​ను ప్రోత్సహించడం, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులను, పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపర్చడం పిల్లలు, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయాలని సీఎస్ విజయానంద్ సూచించారు.

పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.