ETV Bharat / state

ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం - TET Schedule Released - TET SCHEDULE RELEASED

Andhra Pradesh TET Schedule 2024 Released: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్​ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.

tet_schedule_released.
tet_schedule_released. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 4:30 PM IST

Updated : Jul 8, 2024, 5:01 PM IST

Andhra Pradesh TET Schedule 2024 Released: మెగా డీఎస్సీ (AP Mega DSC) ప్రకటించి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన నిర్ణయాలు చకచకా తీసుకుంటోంది. డీఎస్పీకి ముందు నిర్వహించే టెట్‌కు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించగా ఆ షెడ్యూల్‌ను ఇప్పుడు సవరించింది. ఆగస్టు 3 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.

AP TET 2024: 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

సిలబస్ ఆధారంగానే సన్నద్ధం కావాలి: ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహలు వద్దని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ (Education Commissioner S. Suresh Kumar) సూచించారు. టెట్‌ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ వివరాలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2024 టెట్ సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలి పేర్కొన్నారు. పాత సిలబస్ ఆన్‌లైన్‌లో ఉంచినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడొద్దన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌ సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్ధారించామని, అందువలన దానిని వెబ్​సైట్​లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు టెట్​కు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలి - అధికారులను ఆదేశించిన మంత్రి లోకేశ్ - Nara Lokesh Review With Officials

ఏపీ టెట్​పై విద్యాశాఖ క్లారిటీ - ఫిబ్రవరిలో ఇచ్చిన సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు - AP TET 2024 Syllabus

Last Updated : Jul 8, 2024, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.