Mountaineer Sameera Khan: సాహసోపేతంగా కొండలను ఎక్కుతూ మంచు పర్వతాల మధ్య సైక్లింగ్ చేస్తూ పిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ఈ యువతికి చిన్ననాటి నుంచి కష్టాల కడలితోనే పరిచయాలు ఎక్కువ. వాటిని అధిగమించి సాహసాలను సైతం సునాయాసంగా చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ యువతి పేరు సమీరా ఖాన్. స్వస్థలం అనంతపురం. తల్లిదండ్రులు జాఫర్ ఖాన్, ఖాతూన్. వీరికి ఐదుగురు సంతానం. సమీరాకు ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లి తనువు చాలించింది.
దీంతో తండ్రి జాఫర్ ఈ యువతి ఆలనా పాలనా చూసుకున్నాడు. కానీ, చదువు పూర్తయ్యేదాక ఉండలేదు. సమీరాకు పదిహేనేళ్లు ఉన్నప్పుడే మరణించంతో చిన్నతనంలోనే తన బాగోగులు తానే చూసుకోవల్సిన పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయినా తనలోని ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమైన పర్వతారోహణ, సైక్లింగ్ పైన దృష్టి పెట్టింది. తండ్రి బతికున్నప్పుడే కశ్మీర్, అమర్నాథ్ యాత్రలకు వెళ్లొచ్చిన అనుభవంతో అదే దిశగా పయనించాలని నిర్ణయించుకుంది.
ఓడిన వైకల్యం- ఈ యువ క్రికెటర్ల సంకల్పానికి విజయం దాసోహం! - Deaf and Dumb Cricket Players
ఆ యువతికి చిన్ననాటి నుంచి కష్టాలే. తలిదండ్రులకు ఐదుగురు సంతానం కావడం, తానే చివరి సంతానం కావడంతో అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరగాల్సి వచ్చింది. ఆ యువతి నలుగురి అక్కలకు వివాహం చేసిన తల్లిదండ్రులు ఆమె బాగోగులు చూడకుండానే అనారోగ్యంతో కన్నుమూశారు. 15 ఏళ్ల వయసు నుంచే జీవిత పోరాటం మొదలుపెట్టిన యువతి సమీరా ఖాన్ ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.
తనకంటే ముందు పుట్టిన నలుగురి అక్కల నుంచి పెద్దగా ఆదరణ లేకపోయినా సొంతంగా బతకడం నేర్చుకున్న సమీరా.. ఓవైపు సొంతంగా సంపాదిస్తూ, మరోవైపు ఆమె లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా పర్వతారోహణ, హైఆల్టిట్యూడ్ సైక్లింగ్తో 37 దేశాలు చుట్టేసింది. తన తండ్రి బతికుండగానే తొలుత కశ్మీర్, అమర్నాథ్ యాత్రకు వెళ్లివచ్చిన సమీరా తాను లక్ష్యాలను చేరుకోడానికి ప్రణాళిక చేసుకున్న సమయంలో తండ్రి కన్నుమూయడం ఆమెకు తీరని లోటుగా మారింది.
తన జీవనం కోసం 15 ఏళ్ల వయసులో చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన సమీరా, తన లక్ష్యం ఇది కాదని గ్రహించి ఏడాదిలోనే ఉద్యోగం మానేసి, సంపాదించిన డబ్బుతో దేశంలోని పలు ప్రాంతాల్లోని పర్వతాలను అధిరోహించింది. అనేక కష్టాలు వెంటాడుతున్నా తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో విధితో యుద్ధం చేస్తూ ముందుకు వెళ్తోంది.
"నేను ఇప్పటి వరకు సైక్లింగ్, పర్వతారోహణ చేసి 37 దేశాలను చుట్టి వచ్చాను. ఈ క్రమంలో పలు దేశాల పర్వతాల అధిరోహణకే పరిమితమైన నేను ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయా దేశాల్లో ప్రధాన నగరాల్లో పర్యటించలేకపోయాను. నా లక్ష్యాల్లో మిగిలిపోయిన పర్వతాలను అధిరోహించడంతోపాటు, అనంతపురంలో రాక్ క్లైంబింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం సుమారు 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ తరహా స్టూడియో రాష్ట్రంలో లేకపోవడంతో అనేక మంది యువత ఆసక్తి ఉన్నా పర్వతారోహణపై శిక్షణ తీసుకోలేకపోతున్నారు. రాక్ క్లైంబింగ్ అకాడమీకి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే తెలంగాణలోని హైదరాబాద్ తరహాలో స్టూడియో ఏర్పాటు చేసి అనేకమంది పర్వతారోహకులను తయారు చేస్తాను." - సమీరా ఖాన్, పర్వతారోహకురాలు
తండ్రి ట్రైనింగ్.. చీరకట్టులో కోట ఎక్కిన 8 ఏళ్ల చిన్నారి.. ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా!