Unidentified Man Attacked Teacher In Srikakulam District : శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం బొర్రపుట్టుగ గ్రామ సమీపంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయురాలు భారతి పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఉపాధ్యాయురాలిని కవిటి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల రాకతో దాడి చేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
గొలుసు కోసం దాడి! స్థానికుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయురాలి మెడలో ఉన్న గొలుసును గమనించిన నిందితుడు దాన్ని లాక్కొనే క్రమంలో ఈ ప్రమాదం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయమైందని వారు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే తమ గ్రామమైన బైరిపురం నుంచి బొర్రపుట్టుగ పాఠశాలకు వెళ్లే మార్గంలో ఈ ఉదంతం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు వైద్యాధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. దాడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కవిటి పోలీసులు తెలిపారు.
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ - గుడివాడ గడ్డం గ్యాంగ్
గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు