AP Capital Amaravati Works Started : విధ్వంస పాలకుడి అరాచకానికి ఇన్నాళ్లూ ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది. రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, దాన్నో చిట్టడివిలా మార్చేసిన సీఆర్‌డీఏలో కదలిక మొదలైంది. వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో సీఆర్డీఏ ఆగమేఘాలపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపల తొలగింపు పనులు నాలుగు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు - ముళ్లకంపలు, చెట్ల తొలగింపు - Amaravati works
Amaravati is Sparkling with Electric Lights : రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో అమరావతిలో మళ్లీ వెలుగలతో కళకళలాడుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్ యాక్లెస్ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై రెండు దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును తాజాగా పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈ రహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులు కనులవిందు చేశాయి. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా రాజధానికి పూర్వ వైభవం- అమరావతిలో అభివృద్ధి పనుల పరుగు - Amaravati Cleaning Works