Amaravati Farmers on Increase in Labor Pension by YCP Govt: రాజధాని కోసం భూములిచ్చిన 29వేల మంది రైతులకు అప్పటి ప్రభుత్వం ఏటా కౌలు చెల్లించేది. అయితే ఎలాంటి భూమి లేకుండా రాజధాని భూముల్లో పనులు చేసుకునే కూలీల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వచ్చింది. అప్పుడు వారికి నెలనెలా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించి రూ.2వేల 500 చొప్పున చెల్లిస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కౌలు, పేదలకు పెన్షన్ సకాలంలో వచ్చింది లేదు.
జగన్ సర్కారు తెచ్చిన మూడు రాజధానుల ప్రకటనతో వారంతా ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండటంతో ప్రభుత్వం కక్ష పెంచుకుంది. అయితే మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉండటంతో, విశాఖకు రాజధాని తరలించాలన్న కుట్రలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజధాని పేదల్ని మచ్చిక చేసుకోవటానికి వారి పెన్షన్ 2వేల500 నుంచి రూ.5వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైసీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు
ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 1వ తేది నుంచి పంపిణీ ప్రారంభించింది. అయితే పెన్షన్ పెంపు వెనుక జగన్ కుట్ర దాగిఉందని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ ఈ ప్రాంతానికి వచ్చి పేదల పెన్షన్ పెంచుతానని, అసైన్డ్ రైతులకు కూడా ఇతర రైతుల మాదిరిగా కౌలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని దళితులు, పేదలు ఈ విషయంపై ఎన్నిసార్లు మొత్తుకున్నా జగన్ సర్కారు పట్టించుకోలేదు. రాజధాని రైతుల ఉద్యమ డిమాండ్లలో ఇవి కూడా ప్రధానంగా ఉన్నాయి.
బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైన జగన్ సర్కార్ - కట్టుకథలు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి
ఇటీవల ముఖ్యమంత్రి ఫిరంగిపురం వచ్చినప్పుడు ఎమ్మెల్యే సుచరిత పేదల పెన్షన్ పెంపుపై ఆయన్ను అడిగారు. ఆ సభలో పెన్షన్ల పెంపుపై సీఎం ప్రకటన చేయటం కొద్దిరోజులకే జీవో విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను మొత్తం రూ. 5వేలు మార్చి 1వ తేదీ నుంచి అందిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొంది. కానీ టీడీపీ హయాంలో 21వేల మందికి పెన్షన్ ఇస్తుండగా జగన్ ప్రభుత్వం అందులో కోతలు పెట్టి 17,200కు తగ్గించింది. పెంచుతానన్న పెన్షన్ ఐదేళ్ల తర్వాత పెంచి అందులోనూ కోత పెట్టారని రాజధాని రైలు ఆరోపిస్తున్నారు.
తప్పుడు జీవోల త్రీడీ సినిమాకు నిర్మాత జగన్, దర్శకత్యం ఆదిమూలపు సురేష్: పట్టాభి
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిలో నిర్మాణాలు ఆపివేసింది. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ఆడిన నాటకంతో ఇక్కడి పేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. జగన్ చేసిన విధ్వంసంతో రాజధాని ప్రాంతంలో వారికి ఉపాధి లేకుండా పోయింది. నిర్మాణాలు ఆగటంతో వారందరికీ ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా జగన్ పేదల పెన్షన్ పెంచానని గొప్పలకు పోతున్నారు.
ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తానన్న హామీని ఐదేళ్ల పాటు పక్కన పెట్టిన జగన్కు పేదల పట్ల ప్రేమ ఉన్నట్లు ఎలా అవుతుంది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టిన సమయంలో కూడా జగన్ పెన్షన్ పెంపు ప్రకటన చేసినా ఆ తర్వాత పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిననాటినుంచీ రాజధానిని ధ్వంసం చేస్తూ, అక్కడి ప్రజల్ని కేసులతో వేధించిన జగన్ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.