ETV Bharat / state

జర జాగ్రత్త - మద్యంలో నీళ్లు, స్పిరిట్‌ - స్పెషల్​ టీమ్​తో కల్తీ - ADULTERATED ALCOHOL IN TG

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కల్తీ మద్యం విక్రయాలు - కల్తీని సొమ్ము చేసుకుంటున్న వైనంపై 'ఈటీవీ భారత్‌ ప్రత్యేక' కథనం

Adulterated Alcohol Sales Increasing in Telangana
Adulterated Alcohol Sales Increasing in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 8:00 PM IST

Adulterated Alcohol in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. సీసా మూత తీసి కల్తీ చేస్తే తెలిసిపోతుందని అనుమానం రాకుండా మళ్లీ బిగిస్తున్నారు. జిల్లా కేంద్రం సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో మద్యం కల్తీ ఆనవాళ్లు వెలుగు చూసినట్లు మందుబాబులు అంటున్నారు. విలువైన మద్యాన్ని కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై 'ఈటీవీ భారత్‌ (ETV Bharat)' కథనం

Adulterated Alcohol Sales Increasing in Telangana : : ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలోంచి తెచ్చిన రూ.2 వేల పైచిలుకు విలువైన మద్యం ఫుల్‌ బాటిల్‌ ఇంటికి వచ్చే సరికి లీకై కారింది. సీసాలో మిగిలిన మద్యాన్ని తాగిన సమయంలో స్పిరిట్‌ వాసన వచ్చిందని కొనుగోలుదారులు వెల్లడించారు. మద్యం సీసా మూత తీసి కల్తీ చేసి ఎవరికీ అనుమానం రాకుండా మూత మళ్లీ పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు.

ఏపీలో 81 కొత్త బ్రాండ్లు, 47 అంతర్జాతీయ మద్యం బ్రాండ్లకు అనుమతి : కొల్లు రవీంద్ర

జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో సైతం మండలంలోని 2 గ్రామాలకు చెందిన ఇద్దరు వేరు వేరుగా కొనుగోలు చేసిన రెండు మద్యం సీసాలు ఇదే విధంగా కారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మాచారెడ్డి మండంలోని మద్యం దుకాణాల్లో సైతం ఈ విధంగా అక్రమాలు వెలుగు చూశాయని మందుబాబులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై ఆబ్కారీ శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కేసులు చేసిన పలు సందర్భాలు వెలుగు చూశాయి.

వారిని నియమించుకుని మరీ : గోలా మూత ఉండడం వల్ల సీసాలోంచి మద్యాన్ని బయటకు తీయడమే కానీ లోనికి పోసేందుకు అవకాశం ఉండదు. కానీ నైపుణ్యం ఉన్న కొందరు మాత్రం గోలా మూతతో సహా బయటకు తీస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఫుల్‌ బాటిల్‌లోని మద్యాన్ని బయటకు తీసి నీళ్లు, స్పిరిట్‌, ఇతర చౌకబారు మద్యాన్ని నింపి మూత యథావిధిగా బిగిస్తున్నారు. దీనికి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బార్‌ అండ్ రెస్టారెంట్లలో పని చేసిన వారిని ప్రత్యేకంగా నియమించుకుని ఇలాంటి పనులు చేయిస్తున్నారని సమాచారం. ఇక మామూలు ఆఫ్ బాటిల్‌, క్వార్టర్​లలో ఈజీగా మూతలు తీసి కల్తీ చేస్తుంటారు.

రూ.45 కోట్ల మేర మద్యం విక్రయాలు : జిల్లాలో 49 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా వందల సంఖ్యలో మద్యం గొలుసు దుకాణాలు వెలిసిన విషయం బహిరంగ రహస్యమే. వివిధ మార్గాల ద్వారా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు రూ.45 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నిత్యం రూ.1.50మేర మద్యం అమ్ముడవుతోంది.

'చీప్ లిక్కర్​ను అన్ని చోట్లా పెడతాం - వైఎస్సార్సీపీ వాళ్లకూ మద్యం దుకాణాలు '

మందుబాబులకు గుడ్​న్యూస్ - త్వరలో కొత్త బ్రాండ్లు, ధరల తగ్గింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.