ETV Bharat / state

ఐపీఎస్ సంజయ్ మెడకు ఏసీబీ ఉచ్చు - విచారణకు ప్రభుత్వం అనుమతి - ACB INQUIRY ON IPS SANJAY

వెలుగులోకి ఐపీఎస్ సంజయ్​ అక్రమాలు - అగ్నిమాపక డీజీ, సీఐడీ చీఫ్‌గా నిధుల దుర్వినియోగం

AP CID EX Chief Sanjay Irregularities
AP CID EX Chief Sanjay Irregularities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

ACB Inquiry on IPS Sanjay : వైఎస్సార్సీపీ నాయకులతో అంటకాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌ మెడకు ఏసీబీ ఉచ్చు బిగుసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగాధిపతిగా, అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేసిన ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు.

అగ్నిమాపకశాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు అగ్ని-ఎన్​ఓసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పటి అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్‌ అప్పగించారు. ఎలాంటి పనులు చేయకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. అలాగే సీఐడీ విభాగధిపతిగా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌కు ఇచ్చి రూ.1.19 కోట్లు చెల్లించారు. అయితే సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్‌ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట నిధులన్ని దోచేశారు. ఈ రెండు సంస్థలకు చెల్లింపులు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

AP Govt Focus on IPS Sanjay : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సర్కార్​కి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరపేందుకు ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ సంస్థల ఖాతాల్లోకి చేరిన సొమ్ము ఎవరు విత్‌డ్రా చేశారు అంతిమంగా ఆ సొమ్ము ఎవరికి చేరిందనేది ఏసీబీ విచారణలో తేలనుంది. అయితే ఈ రెండు సంస్థలు ఒకే చిరునామాలో ఉన్నాయని క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ డొల్ల కంపెనీ అని విజిలెన్స్‌ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనక ఎవరున్నారు? ఎందుకు ఏర్పాటు చేశారు? నిధులు ఎలా పక్కదారి పట్టించారనేదానిపై ఏసీబీ వివరాలు సేకరించనుంది.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ - 'సంజయ్‌' డొల్ల కంపెనీల గుట్టురట్టు

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.