Boy Missing From Meerpet Found In Tirupati : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం ఘటన సుఖాంతమైంది. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో వారు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అబ్బాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈలోగా తిరుపతి పోలీసులు బాలుడు తమవద్ద ఉన్నట్లు కుటుంబసభ్యులతో పాటుగా, మీర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు.
మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం : జిల్లెలగూడ దాసరినారాయణరావు నగర్‌కు చెందిన ఓ బాలుడు మీర్‌పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ప్రతిరోజు మీర్‌పేటలో ట్యూషన్‌కు వెళ్తుంటారు. ఈనెల 4న సాయంత్రం ఆ బాలుడు తన సోదరుడితో ట్యూషన్‌కు వెళ్లాడు. ట్యూషన్‌కు వెళ్లిన ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మొదట చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ట్యాషన్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చిన బాలుడు ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాడు. ఆ తర్వాత బైక్ దిగి బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. అలా మీర్‌పేట్ జంక్షన్ బస్టాప్‌లో దిగాడు. అలా నడుచుకుంటూ మలక్‌పేట్ వెళ్లాడు. రైల్వే స్టేషన్లోకి వెళ్లిన బాలుడు ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు.
తిరుపతి పోలీసుల సహకారంతో : తిరుపతిలో స్కూల్ డ్రెస్‌తో తిరుగుతున్న బాలుడిని చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడిని ప్రశ్నించారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలిపాడు. సదరు అబ్బాయి వద్ద నుంచి అతని తండ్రి ఫోన్ నెంబర్ తీసుకొని, ఫోన్ చేసి బాబు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. బాబును తిరుపతిలో పోలీసులకు అప్పగించారు. కుమారుడి క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మీర్‌పేట్ పోలీసులతో కలిసి వారి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతికి వెళ్లారు.
స్కూల్‌కు వెళ్తారనుకుంటే అదృశ్యమయ్యారు - అన్నదమ్ముళ్ల ఆచూకీ కోసం పోలీసుల గాలింపు