ETV Bharat / state

పోస్టింగుల్లో ఒకే సామాజిక వర్గానికే పెద్దపీట - 104 మంది డీఎస్పీలు బదిలీ

104 DSPs Transfer in AP: సార్వత్రిక ఎన్నికల వేళ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారుల పోస్టింగుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వంలోనూ, వైఎస్సార్సీపీలోనూ అన్నింటా అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన అధికారులకే ఎక్కువగా ఎస్‌డీపీవో పోస్టుల్లో ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 104 మంది సివిల్‌ విభాగం డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. అందులో 42 పోలీసు సబ్‌డివిజన్లలో ప్రస్తుతం పని చేస్తున్న ఎస్‌డీపీవోల స్థానంలో వేరే అధికారులను నియమించారు. వారిలో 10 మంది ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి అనుకూలమైన, అత్యంత సన్నిహితమైన సామాజికవర్గం వారు ఉన్నారు. ఈ లెక్కన ప్రాధాన్య పోస్టింగులుగా భావించే ఎస్‌డీపీవో పోస్టుల్లో 23.80 శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో నింపేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

104_DSPs_Transfer_ in_AP
104_DSPs_Transfer_ in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 8:06 AM IST

పోస్టింగుల్లో ఒకే సామాజిక వర్గానికే పెద్దపీట - 104 మంది డీఎస్పీలు బదిలీ

104 DSPs Transfer in AP : రెండు నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వీటి నిర్వహణలో శాంతిభద్రతల పరంగా కీలక బాధ్యతలు నిర్వర్తించేది ఎస్‌డీపీవోలే. అందుకే తమకు అనుకూలమైన సామాజిక వర్గానికి చెందిన, అధికార వైఎస్సార్సీపీ అరాచకాల పట్ల చూసీ చూడనట్లు ఉంటారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడతారనే గుర్తింపు కలిగిన అధికారులకు ప్రభుత్వం కీలక పోస్టింగులిచ్చింది. వివాదాస్పద అధికారులుగా పేరొందిన పలువురికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పించింది. వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తారనుకునేవారికి పెద్దపీట వేసింది. ఎన్నికల్లో వీరిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలనే కుటిల వ్యూహాం దీని వెనక ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

AP DSPs Transfers : రాయలసీమ జిల్లాల పరిధిలో 11 పోలీస్‌ సబ్‌డివిజన్లకు తాజా బదిలీల్లో ఎస్‌డీపీవోలను నియమించారు. వీరిలో శ్రీకాళహస్తి, అనంతపురం, చిత్తూరు, ఆళ్లగడ్డ, నాయుడుపేట, మదనపల్లె, పలమనేరు, గుంతకల్లు సబ్‌డివిజన్ల ఎస్‌డీపీవోలుగా వచ్చిన బి.ఉమామహేశ్వరరెడ్డి, జి.వీరరాఘవరెడ్డి, ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఎన్‌.సుధాకర్‌రెడ్డి, వి.శ్రీనివాసరెడ్డి, జి.ప్రసాదరెడ్డి, మహేశ్వరరెడ్డి, జి.శివభాస్కర్‌రెడ్డి మొత్తం 8మంది రాష్ట్ర ప్రభుత్వంలోనూ, వైఎస్సార్సీపీలోనూ అన్నింటా అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అంటే రాయలసీమ జిల్లాల్లోని సబ్‌డివిజన్లకు తాజాగా బదిలీ అయిన అధికారుల్లో 72.72 శాతం మంది ఆ సామాజిక వర్గం వారే ఉన్నారంటేనే ఈ బదిలీలు ఏ ప్రాతిపదికన జరిగాయో ఇట్టే అర్థమైపోతుంది.

వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు సలాం కొట్టి ఉన్నత పదవి పట్టేశారు!

AP 2024 Elections : 2019 మే నెలలో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు ఓ సామాజిక వర్గంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా తాజా బదిలీల్లో ఎస్‌డీపీవోలుగా పోస్టింగులు ఇవ్వలేదు. ఎస్‌డీపీవో పోస్టు చేయగలిగే ఒక్కరంటే ఒక్క అధికారి కూడా ఆ సామాజికవర్గంలో ప్రభుత్వానికి కనిపించలేదా? ఇది వివక్ష కాదా? ప్రతిభ, సమర్ధత, నిజాయతీ, పనితీరు, సమగ్రత వంటి అంశాలను అర్హతగా, ప్రామాణికంగా తీసుకుని పోస్టింగులివ్వాల్సిన ప్రభుత్వం అధికారుల సామాజిక వర్గం, వైఎస్సార్సీపీకు వారెంతగా దాసోహమవుతారు, అరాచకాలకు ఎంతగా వెన్నుదన్నుగా నిలుస్తారు? అనే అంశాల ప్రాతిపదికగా పోస్టింగులిస్తోందనటానికి తాజా బదిలీలే తిరుగులేని రుజువు.

Police Transfers in AP: చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీగా పనిచేసిన ఎన్‌.సుధాకర్‌రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర అణిచివేత ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశమే చట్టం అన్నట్లుగా పనిచేశారు. జీవో-1ను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డు షోకు అనుమతి నిరాకరించారు. ఆయన్ను కుప్పం రానీయకుండా అడ్డుకున్నారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ప్రతిపక్షాల వారిపై అనేక అక్రమ కేసులు బనాయించారు. అధికార పక్షం అరాచకాలకు వంతపాడారు. అలాంటి అధికారి తాజా బదిలీల్లో ఆళ్లగడ్డ ఎస్‌డీపీవోగా నియమితులయ్యారు.

గుంటూరు ఉత్తరం డివిజన్‌ ఎస్‌డీపీవోగా ఉన్న జె.రాంబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై రెండున్నరేళ్ల కిందట వైఎస్సార్సీపీ అల్లరిమూకలు దాడికి తెగబడి విధ్వంసం సృష్టించిన ఘటనలో నిందితులుగా ఉన్న ఏ ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. అసలు ఆ కేసులో చర్యలే తీసుకోలేదు. మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డ వారిపై బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద నామమాత్రపు కేసులు పెట్టి కొమ్ముకాశారు. అందుకు బహుమానంగా తాజా బదిలీల్లో ఆయనకు అత్యంత కీలకమైన మచిలీపట్నం ఎస్‌డీపీవోగా పోస్టింగు దక్కింది.

రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐఏఎస్‌లు బదిలీ - సీఎస్​ ఉత్తర్వులు

శ్రీకాళహస్తి ఎస్‌డీపీవోగా నియమితులైన బి.ఉమామహేశ్వరరెడ్డి..గుంటూరు పశ్చిమ ఎస్‌డీపీవోగా పనిచేసిన సమయంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసి విశాఖపట్నం నుంచి గుంటూరుకు అర్ధరాత్రి వేళ తీసుకొచ్చారు. మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మందులు అందించటానికి కూడా అనుమతించకుండా వేధించారు.

అనంతపురం ఎస్‌డీపీవోగా నియమితులైన జి.వీరరాఘవరెడ్డి పూర్తిగా వైఎస్సార్సీపీతో అంటకాగుతారన్న విమర్శలున్నాయి. ఆయన అంతకు ముందు మూడేళ్ల పాటు అనంతపురంలోనే ఎస్‌డీపీవోగా పనిచేశారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై విమర్శలు చేసినందుకు గాను టీడీపీ మహిళా నాయకురాళ్ల ఇంటిపైకి అర్ధరాత్రి వేళ పోలీసులతో వెళ్లి సోదాలు నిర్వహించారు. వారి పడకగదుల్లోకి చొరబడి మరీ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ప్రైవేటీకరణను నిలిపేయాలని ధర్నా చేస్తున్న విద్యార్థులను కాళ్లు, చేతులు విరిగిపోయేలా కొట్టారు. వారిని పోలీసుస్టేషన్‌లకు తరలించి బెదిరించారు. 2019 ఎన్నికల సమయంలో అనంతపురం డీఎస్పీగా ఉంటూ వైఎస్సార్సీపీకు కొమ్ముకాశారు.

పలమనేరు ఎస్‌డీపీవోగా బదిలీ అయిన సి.మహేశ్వర్‌రెడ్డి నంద్యాలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల కనుసన్నల్లో పనిచేశారు. ఆయన డీఎస్పీగా కంటే అధికార వైకాపా కార్యకర్తలాగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వారి అరాచకాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై జులుం ప్రదర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించి, వైఎస్సార్సీపీ నాయకులకు కొమ్ముకాశారన్న విమర్శలు ఈయనపై ఉన్నాయి. అధికార పార్టీకి ఆయన చేసిన సేవలకు మెచ్చే మరోసారి ఎస్‌డీపీవోగా ఆయనకు కీలక సబ్‌డివిజన్‌లో పోస్టింగు ఇచ్చారు.

విజయవాడ పశ్చిమ జోన్‌ ఏసీపీగా నియమితులైన పి.మురళీకృష్ణారెడ్డి కాకినాడలో అధికార పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఉంటూ ప్రతిపక్ష నాయకులపై ఉక్కుపాదం మోపారు. వైఎస్సార్సీపీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలుస్తారనే పేరున్న వి.నారాయణస్వామిరెడ్డిని భీమవరం ఎస్‌డీపీవోగా నియమించారు. ఈయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా వాసి. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఈయన్ను పట్టుపట్టి ఒంగోలు డీఎస్పీగా నియమించుకున్నారు. భూ వివాదాల్లో తలదూర్చి ప్రతిపక్షాలకు చెందిన వారిని బెదిరించారన్న విమర్శలు ఈయనపై ఉన్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం సబ్‌డివిజన్‌ ఎస్‌డీపీవోగా బి.శ్రీనాథ్‌ను నియమించారు. ఈయన భీమవరం ఎస్‌డీపీవోగా పని చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించారు. భీమవరంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రపై వైఎస్సార్సీపీ శ్రేణులు రాళ్ల వర్షం కురిపించి, కర్రలు, సోడాసీసాలతో దాడి చేస్తే అక్కడే ఉన్న డీఎస్పీ శ్రీనాథ్‌ వారిని నిలువరించలేదు. ఆ తర్వాత బాధితులైన యువగళం వాలంటీర్లపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అసలు ఘటనా స్థలంలోనే లేని వృద్ధురాలైన టీడీపీ నాయకురాలు తోట సీతారామలక్షీపై హత్యాయత్నం కేసు పెట్టారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలే ఐపీసీ అన్నట్లుగా వ్యవహరించే ఎం.రాజగోపాల్‌రెడ్డికి చిత్తూరు ఎస్‌డీపీవోగా నియమించారు. ఈయన వైఎస్సార్సీపీ నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తారన్న విమర్శలున్నాయి. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం చెప్పిందల్లా చేస్తారనే ముద్ర ఉన్న హనుమంతరావు ప్రతిపక్షాలను అణచివేశారు. ఇప్పుడాయనకు కాకినాడ ఎస్‌డీపీవోగా పోస్టింగు ఇచ్చారు.

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.