ETV Bharat / spiritual

మనస్సులోని కోరికలను తీర్చే ఇష్ట కామేశ్వరీ దేవి- ఆలయం ఎక్కడుంది? ఎలా పూజించాలి? - Ishta Kameswari Temple

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 5:35 AM IST

Sri Ishta Kameswari Puja : ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప నల్లమల అడవుల్లో వెలసిన ఈ అమ్మవారి దర్శనానికి వెళ్లలేమని అంటారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో చూసేద్దాం రండి!

Sri Ishta Kameswari Puja
Sri Ishta Kameswari (ETV Bharat)

Sri Ishta Kameswari Puja : శివమహాపురాణం ప్రకారం మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో రెండవదిగా భాసిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, దాదాపు 500 శివలింగాలు నల్లమల అడవుల్లో ఉన్నాయంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే నల్లమల అడవుల్లో కొన్ని ఆలయాలకు చేరుకోవడం దుర్లభమే కాదు అత్యంత సాహసమైన విషయం. అందుకే ఇక్కడి అతి ప్రాచీన శివలింగాల గురించి బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడు స్థానికుల సహాయంతో కొందరు సాహసికులు కొన్నింటిని దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలయమే నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం.

దేశంలో ఎక్కడా లేని అరుదైన ఆలయం
నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు.

అందరికీ దొరకని అపురూప దర్శనం
శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం వెళ్లే అందరికీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం.

కోరిన కోర్కెలు తీర్చే తల్లి ఇష్టకామేశ్వరి దేవి
అతి కొద్ది మంది మాత్రమే ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయని నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. అయితే అందుకోసం మనం ఒక పని చేయాలి. మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పి అమ్మవారి నుదుటన బొట్టు పెట్టాలి.

ఒళ్ళు జలదరించే మహాత్యం
కోరిక చెప్పుకొని అమ్మవారి నుదుటన బొట్టు పెట్టే భక్తులు ఒళ్ళు జలదరించే అనుభూతిని పొందుతారు. మన చేతితో అమ్మవారి నుదురు తాకగానే నిజంగా మనిషి నుదురులాగా మెత్తగా తగిలి అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు జలదరిస్తుంది. ఈ మహత్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానందాలతో తన్మయత్వానికి లోనవుతారు.

నాడు సిద్ధులు నేడు సామాన్య ప్రజలు కూడా!
ఒకప్పుడు ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకోడానికి సరైన దారి కూడా ఉండేది కాదు. కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం. అందుకే పూర్వం అడవుల్లోని సిద్ధులచే అమ్మవారు పూజలందుకునేది. ఇప్పుడు కొంత మెరుగైన రవాణా సౌకార్యాలు అందుబాటులోకి వచ్చాక సామాన్య భక్తులు కూడా ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ కోరికలు అమ్మవారికి నివేదించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు.

అమ్మవారి అద్భుత స్వరూపం
ఇష్టకామేశ్వరి అమ్మవారి స్వరూపం ఆధ్యాత్మిక భక్తి భావాలను కలిగిస్తుంది. చతుర్భుజాలతో దర్శనమిచ్చే అమ్మవారు రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో శివలింగాన్ని, రుద్రాక్షమాలను ధరించి తపస్సు చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు. ఓ గుహలో ఉన్న దేవాలయంలో వెలసి ఉన్న ఇష్ట కామేశ్వరి అమ్మవారిని దీపపు వెలుగు మధ్య దర్శించుకోవాలి. ప్రశాంతమైన ఈ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక భావన కలిగిస్తాయి. ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఈ అడవుల్లో స్థానికంగా నివసించే చెంచులు అమ్మవారికి నిత్య పూజలు చేస్తుంటారు.

ఎలా చేరుకోవాలి?
శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి.

సాహసంతో కూడిన ప్రయాణం
పూర్తిగా అటవీ మార్గంలో ఉండే ఇష్టకామేశ్వరి ఆలయానికి చేరుకోడానికి సౌకర్యవంతమైన రోడ్డు లేకపోవడంతో దారిలో కొండల మీదుగా అనేక బండరాళ్లను దాటుకుంటూ జీపులు ప్రయాణిస్తాయి. కొన్ని సమయాల్లో జీపు పల్టీ కొడుతుందేమో అని భయం కూడా కలుగుతుంది. కాకపోతే ఈ మార్గంలో జీపులు నడిపే డ్రైవర్లు ఎంతో నేర్పు, అనుభవం కలిగిన వారు కావడంతో సురక్షితంగానే గమ్యస్థానానికి చేరుస్తారు. అత్యంత సాహసోపేతమైన ఈ ప్రయాణం చేసి గమ్యం చేరాక అమ్మవారి దర్శనంతో అన్ని మర్చిపోతాం. జీవితంలో ఒక్కసారైనా ఇష్ట కామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం మీపైనే- భగవంతుడికి భక్తే ప్రధానం! - how to pray god in hinduism

ఇక్కడ పూజిస్తే పుత్ర సంతానం పక్కా! కోరిన వరాలిచ్చే వరద వినాయకుడు- ఎక్కడో తెలుసా? - Lord Ganesha Worship

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.