ETV Bharat / spiritual

ఉద్యోగులకు ప్రమోషన్- పెండింగ్ పనులన్నీ క్లియర్- ఆ రాశి వారు నేడు ఇలా! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 4:46 AM IST

Horoscope Today June 27th 2024 : జూన్​ 27న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today June 27th 2024 : జూన్​ 27న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజంతా స్నేహితులతో సరదాగా గడుపుతారు. బహుమతులు, కానుకలు అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. బంగారు భవిష్యత్​కు బాటలు వేసుకుంటారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలను చేపడతారు. సంతానం కారణంగా సంపద వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ దేవి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు శుభకరంగా ఉంటుంది. గతంలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా ముగుస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రమోషన్లకు అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల కారణంగా పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆర్ధిక సమస్యల వలన ఏ పనులు ముందుకు సాగవు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా తయారవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి చేసే పనిలో ఎదుగుదల లేక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుత్సాహాన్ని, నిరాశావాదాన్ని దూరంగా ఉంచితే మీకు మంచిది. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి శుభసమయం నడుస్తోంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు బోనస్, ప్రమోషన్ వంటి ప్రయోజనాలు పొందుతారు. సృజనాత్మక సామర్థ్యాలు ఆయుధాలుగా చేసుకొని చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభకరంగా ఉంటుంది, మిత్రుల సహాయంతో నూతన వ్యాపారాలు మొదలుపెడతారు. సమాజానికి మేలు చేసే పనులు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన ఆర్ధిక వనరులను సమకూర్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి తీవ్రమైన శ్రమతోనే పనులు పూర్తవుతాయి. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక లావాదేవీల్లో మోసాలు జరిగే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయసూత్రం. బంధుమిత్రులను కలుసుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా అవసరం. అసూయపరుల మాటలకు విలువ ఇవ్వొద్దు. కుటుంబ వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయానుకూలంగా నడుచుకుంటే అన్ని రంగాల వారికి కార్యసిద్ధి ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు పనిపట్ల ఏకాగ్రతతో ఉంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన శక్తినిస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. దైవబలంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. వృథా ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాల కారణంగా శ్రమాధిక్యత పెరుగుతుంది. ముందుచూపుతో, ప్రతిభతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. మొహమాటాలకు పోకుండా లౌక్యంగా ఉంటే ఇబ్బందులు తప్పుతాయి. ఆర్ధిక లాభాలు ఉంటాయి. శ్రీరామ నామ జపం శక్తినిస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాద బలంతో అనుకున్నది సాధిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిలో పురోగతి ఉంటుంది. సంపాదన వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.