ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు సన్నిహితులతో గొడవలు- గణపతి ఆలయ సందర్శన శుభకరం - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 5:01 AM IST

Horoscope Today July 1st 2024 : జులై​ 1న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today July 1st 2024 : జులై​ 1న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సుఖంగా, శాంతిమయంగా గడుస్తుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆశించిన స్థాయిలో సంపాదన, లాభాలు పెరుగుతాయి. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారసత్వపు ఆస్తులు కలిసివస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి వ్యాపార రంగాల వారికి చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. తీరికలేని పనులు, తీవ్రమైన ఒత్తిడి ఉంటాయి. ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే సమస్యలు ఉండవు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆశించిన ప్రమోషన్ కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. సన్నిహితులతో విబేధాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ ధ్యానంతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలతో గందరగోళానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగులు సమయపాలన పట్ల కచ్చితంగా లేకపోతే ప్రమాదం. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. లాభాలు లేకపోయినా నష్టం రాకుంటే చాలు అనే పరిస్థితి వస్తుంది. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, ఆప్యాయతలు మెరుగుపడతాయి. కళాకారులకు, మీడియా రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. సన్మాన సత్కారాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆర్ధిక లాభాలుంటాయి. పదోన్నతుల కోసం ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో కోరుకున్న ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. ధన నష్ట సూచితం. ఉద్యోగులకు పని ప్రదేశంలో సమస్యలు ఎదురుకావచ్చు. సహోద్యోగుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారులు వ్యాపారంలో రాణిస్తారు. లాభాలను ఆర్జిస్తారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధనతో స్వస్థత చేకూరుతుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. విశేషమైన దైవబలం అండగా ఉన్నందున అన్ని రంగాల వారికి ప్రారంభించిన పనులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. సమయానుకూలంగా నడుచుకుంటే ముఖ్యమైన కార్యాలలో విజయం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధికంగా సత్ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా మీ మాట తీరు కారణంగా కలహాలు ఏర్పడతాయి. గృహంలో అశాంతి నెలకొంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేసేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. విదేశాల నుంచి అందుకున్న శుభవార్తలు మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఈ రోజు అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే సహనంతో ఉండండి. అపజయాలకు కృంగిపోవద్దు. ఇంటా బయట శాంతంగా ఉంటూ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంతానం చదువు, ఉద్యోగాల గురించి ఆందోళనకు గురవుతారు. ప్రయణాలు వాయిదా వేసుకోండి. శనికి తైలాభిషేకం జరిపిస్తే ప్రశాంతంగా ఉంటుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం బాగోలేనందున ఎటు చూసినా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా అధిక ధనవ్యయం ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మీ మనోవేదనకు కారణమవుతుంది. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవచ్చు. శత్రుభయం పొంచి ఉంది. సమాజంలో అవమానకర పరిస్థితులు ఉండవచ్చు. మీ మొండితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా శత్రువులు పెరుగుతారు. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం వలన మనశ్శాంతి లభిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గాలి కొట్టి మేఘాలు తొలగిపోయినట్లు ఇన్నాళ్ళుగా వేధించిన సమస్యలు, ప్రతికూల పరిస్థితులు తొలగి పోతాయి. అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని చూస్తారు. వ్యాపారస్తులకు ధన ప్రవాహం ఉంటుంది. అనుకోని విధంగా లక్ష్మీకటాక్షం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు సరి సమానంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే అపార్ధాలు, అనుమానాలు పెరుగుతాయి. ఘర్షణలకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.