ETV Bharat / politics

మరోసారి రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం - YSRCP MLC Duvvada Srinivas Issue - YSRCP MLC DUVVADA SRINIVAS ISSUE

YSRCP MLC Duvvada Srinivas Issue: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తండ్రి ఉంటున్న ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలకు దువ్వాడను కలిసే అవకాశం లభించలేదు. దీంతో ఎమ్మెల్సీపై ఆయన భార్య, టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త కార్యకర్తల్ని, కుటుంబాన్ని నట్టేటముంచేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

YSRCP MLC Duvvada Srinivas Issue
YSRCP MLC Duvvada Srinivas Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 8:28 PM IST

YSRCP MLC Duvvada Srinivas Issue: 'రాజకీయాల్లో అన్నీ కోల్పోయాను, కుటుంబాన్ని కోల్పోయాను, ఒంటరిని అయిపోయాను, నాకు మీరే దిక్కు'.. అంటూ ఎన్నికల ప్రచారంలోను, ఆ తర్వాత తనను కలసిన వారి ఎదుట వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కంటతడిపెడుతుంటారు. 'అది, నిజమైన కన్నీరు కాదు.. మొసలి కన్నీరు, వ్యక్తిత్వంలేని ఆయన వైఖరితో కుటుంబం మాత్రమే కాదు, నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ కూడా రోడ్డున పడి బలయ్యారు'.. అని సాక్షాత్తు కట్టుకున్న భార్య, కన్న కుమార్తెలు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత రెండు రోజులుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనను కలిసేందుకు టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. లోపలికి అనుమతించక పోవడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి గం.2 వరకు గేటు వెలుపలే కారులో కూర్చొని నిరీక్షించి వెనుదిరగాల్సి వచ్చింది.

పార్టీని, కుటుంబాన్ని నట్టేటముంచేసి: అయితే శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​పై టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న అతడి భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైందవి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ గౌరవాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలుపుతున్నారంటూ తూర్పారబట్టారు. తన తాత లక్ష్మీపతిదొర, తండ్రి రాఘవరావు దొర, తాను వందల ఎకరాల అమ్ముకుని రాజకీయం చేశామని, తన భర్తగా ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ చేరి నమ్ముకున్న కార్యకర్తల్ని, పార్టీని, కుటుంబాన్ని నట్టేటముంచేసి రోడ్డున పడేశారని భార్య వాణి విమర్శించారు.

వేరే మహిళతో వివాహేతర సంబంధం: ఎన్నేళ్లుగానో ఓపిక పట్టామని, గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీ అధిష్టానానికి పరిస్థితి వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వైఖరి వలన కేవలం తాము మాత్రమే నష్ట పోవడం లేదని, పార్టీ, కార్యకర్తలు అంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నారని, చాలా మంది జీవితాలను నాశనం చేసిన ఆమె ఉచ్చులో తన భర్త చిక్కుకున్నారని ఆమె ఆరోపించారు.

అలా ఎందుకు చేస్తున్నారు: తమ తండ్రితో తమకు కలసి ఉండాలని ఉందని, అది మాట్లాడేందుకు వెళ్తే గేట్లు మూసేసి లోపలికి రానివ్వలేదని దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందవి ఆరోపించారు. తన తల్లితో విడాకులు తీసుకోకుండా, మరో మహిళతో వివాహం కాకుండా కలసి ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. 60 ఏళ్ల వయసున్న తన తండ్రికి మంచేదో, చెడోదో తెలుసని, తప్పని తెలిసినా అలా ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఈ పరిస్థితులను చూస్తూ ఉపేక్షించబోమని, పార్టీని, కార్యకర్తలను, కుటుంబాన్ని కాపాడుకునేందుకు ముందుకెళ్తామని జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి మీడియతో ఎదుట స్పష్టం చేశారు.

సెల్ ఫోన్​ మాట్లాడుతూ ఓటు వేయవచ్చా? - Duvvada used phone at polling Booth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.