ETV Bharat / politics

తీవ్ర అసంతృప్తిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు - ఎంపీ అవినాష్​ రెడ్డి బుజ్జగింపు - Pending Bills in Pulivendula

YCP Councillors Questioned to Avinash Reddy on Pending Bills : బిల్లుల బకాయిలపై ఇటీవలే మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డిని నిలదీశారు. దాదాపు 250 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. దీనిపై జగన్‌ సమాధానం చెప్పలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న కౌన్సిలర్లను కడప ఎంపీ అవినాష్ ​రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎవరూ పార్టీకి దూరం కావద్దని, జగన్‌ అండగా ఉంటారని అవినాష్ రెడ్డి సర్దిచెప్పినట్లు సమాచారం.

YCP Councillors Questioned to Avinash Reddy on Pending Bills
YCP Councillors Questioned to Avinash Reddy on Pending Bills (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 9:33 PM IST

Updated : Jun 29, 2024, 10:48 PM IST

YCP Councillors Questioned to Avinash Reddy on Pending Bills : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కౌన్సిలర్ల నుంచి ఆ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఇటీవలే మూడు రోజుల పాటు పులివెందులకు వచ్చిన జగన్​ను నిలిచిపోయిన బిల్లులుపై కౌన్సిలర్లు నిలదీశారు. పాడా (PADA) కింద చేపట్టిన 250 కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదు. దీనిపై కౌన్సిలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ కూడా సరైన సమాధానం చెప్పక పోవడంతో కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. వీరి అసమ్మతిని చల్లార్చేందుకు కడప ఎంపీ అవినాష్​ రెడ్డి ఈరోజు పులివెందులలో మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా కౌన్సిలర్లు తమకు రావాల్సిన బిల్లులపై ప్రస్తావించారు.

సీఎం చంద్రబాబు కార్యసాధకుడు - రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారు : సుమన్‌

"చాలామంది కౌన్సిలర్లు పులివెందులలో పనులు చేపట్టారు. ఒక్కో కౌన్సిలర్ కు 2 నుంచి 7 కోట్ల రూపాయల వరకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో ఆ డబ్బులు రావనే ఆందోళన వెంటాడుతోంది. చివరి నిమిషంలో డబ్బులు చెల్లించకుండా నిలిపి వేస్తే తాము ఎలా బతకాలని"లని కౌన్సిలర్లు అవినాష్ రెడ్డిని నిలదీశారు. అందరూ ధైర్యంగా ఉండాలని రికార్డుల పరంగా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచి చూద్దామని, లేదంటే కోర్టును ఆశ్రయిద్దామని అవినాష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఎవరూ పార్టీకి దూరం కావద్దని, జగనన్న అండగా ఉంటారని, ధైర్యంగా ఉండాలని కోరినట్లు తెలిసింది. మరికొందరు కౌన్సిలర్లు ఐదేళ్లలో తాము ఏమీ చేసుకోలేదని నిరుత్సాహ పడినట్లు సమాచారం. వారందరినీ అవినాష్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో మారుమాట్లాడకుండా కౌన్సిలర్లు వెనుదిరిగి వచ్చినట్లు తెలిసింది.

జగన్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు - సమస్యలన్నీ పరిష్కరిస్తాం: చంద్రబాబు

పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 963 కోట్లతో కాంట్రాక్టర్లు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేని పనులే అయినా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు ఇష్టానుసారం పనులు అప్పగించారు. వీటిల్లో చాలావరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిలో బడా నేతలకు మాత్రం ముందు బిల్లులు చెల్లించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్నా, చితకా నేతల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.

పాడా పనులు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరపాలని తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. అందుకు అనుగుణంగానే పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిని రిలీవ్ చేయకుండా కూటమి ప్రభుత్వం అక్కడే ఉంచింది. దీంతో పాడా పనులు చేసిన చిన్నచిన్న గుత్తేదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ బిల్లుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ - CRDA Issued Gazette

Last Updated : Jun 29, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.