Varla Ramaiah met Election Commission about Glass Symbol: గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు ఈసీని మరోమారు కోరారు. జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తుపై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ తప్పుగా అర్ధం చేసుకుందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. జనసేన పోటీ చేసే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకూ గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించేందుకు వీల్లేదని అన్నారు.
కూటమి మేనిఫెస్టో ఏ వర్గానికి ఎలాంటి భరోసా ఇస్తోంది ? - NDA MANIFESTO 2024 IN AP
పార్లమెంటు స్థానంలో జనసేన అభ్యర్ధి లేకపోయినా ఆ పరిధిలోని అసెంబ్లీకి జనసేన పోటీ చేస్తే మిగతా చోట్ల గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించొద్దని కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఒక అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేసినా, మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ స్థానానికి ఇతరులెవకిరీ గ్లాస్ గుర్తు కేటాయించకూడదన్నదే కోర్టు ఉద్దేశమని తెలిపారు. దీన్ని ఎన్నికల కమిషన్ తప్పుగా అర్ధం చేసుకుని జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్ధికి గ్లాసు గుర్తు ఇస్తామని చెబుతోందని అన్నారు. ఈ ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ సరిగా అర్ధం చేసుకోకపోవడం వలన తాము మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని వర్ల రామయ్య తెలిపారు.
రాజధానుల పేరిట జగన్ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours
డీఎస్పీని దూరంగా ఉంచాలి: అనంతపురం డీఎస్పీ జీ. వీరరాఘవరెడ్డిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు (Varla Ramaiah complaint to EC against Anantapur DSP) చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ (YCP leader MVV Satyanarayana)పై కేసు నమోదు చేయాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టి, భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు.
అంతా వైసీపీ కుట్రనే: ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైఎస్సార్సీపీయే ఈ కుట్రకు తెర లేపిందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నచోట్ల, వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, పలు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఎన్నికల సంఘం కేటాయించింది.