ETV Bharat / politics

సిట్​ దర్యాప్తులో కీలక విషయాలు- 'స్వామిభక్తి చాటుకున్న పోలీసులు' - SIT investigation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 9:09 AM IST

SIT investigation : రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ కొనసాగుతోంది. నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో దమనకాండపై సిట్‌ అధికారులు రెండో రోజూ విచారణ నిర్వహించారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులు, ఎందుకు సకాలంలో దాడులను అరికట్టలేకపోయారు? ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించిన సిట్.. ​ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలించింది. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని, సిట్‌ అధికారులను కలుసుకునే అవకాశం ఇవ్వవకుండా అడ్డుపడ్డారని జనసేన నాయకులు ఆరోపించారు.

sit_investigation
sit_investigation (ETV Bharat)

సిట్​ దర్యాప్తులో కీలక విషయాలు- 'స్వామిభక్తి చాటుకున్న పోలీసులు' (ETV Bharat)

SIT investigation : పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్‌ అధికారులను కలిసేందుకు మంత్రి అంబటి రాంబాబును అనుమతించిన పోలీసులు జనసేన నేతలను నాలుగు గంటలకు పైగా బయటనే నిలిపివేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ఆదివారం సిట్‌ సభ్యులు నరసరావుపేట గ్రామీణ పోలీస్​స్టేషన్​లో విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు సిట్‌ సభ్యులను కలిసి నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఆయనకు ఆహ్వానం పలికిన స్థానిక ఎస్సై రోశయ్య వైఎస్సార్సీపీ వర్గీయుల చేతిలో దెబ్బలు తిన్న నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన జనసేన నాయకులు పదిమంది వరకూ వస్తే లోపలకు రానివ్వకుండా అడ్డుకున్నారు. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడితే నాలుగు గంటల పాటు బయటనే ఉంచారు. వైఎస్సార్సీపీ వర్గీయుల ఫిర్యాదు మేరకు తమకు 41ఏ నోటీసులు పంపిన పోలీసులు కౌంటర్‌ ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితులు వెల్లడించారు. ఈ విషయాన్ని సిట్‌ సభ్యులకు తెలిపేందుకు వస్తే అడ్డుకున్నారని జనసేన నేతలు వాపోయారు.

నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu

పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాడులు, ఘర్షణలకు సంబంధించిన అంశాలపై సిట్ లోతైన విచారణ చేపట్టింది. నరసరావుపేట, కారంపూడి, దాచేపల్లిలో పోలీసుల నుంచి సమగ్ర సమాచారం సేకరించినట్లు సమాచారం. హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన కేసులు, అల్లర్ల సమయంలోని వీడియో ఫుటేజ్​ను సిట్ బృందం క్షుణంగా పరిశీలించింది. నరసరావుపేట రూరల్‌ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ.. రాత్రి వరకూ కొనసాగింది. రూరల్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం నాలుగు ఘటనలు చోటు చేసుకోగా, వీటిలోదొండపాడు పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంఎల్‌ఏ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కార్లపై రాళ్ల దాడి జరిగింది. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ఇద్దరినీ అడ్డుకోవడమే కాకుండా తోసేశారు. నూజండ్ల మండలం పమిడిపాడులో అధికార పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడగా సంబంధిత వీడియోలను సిట్‌ సభ్యులు పరిశీలించారు. రూరల్‌ ఎస్సై అధికారపార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? వారికి 41ఏ నోటీసులు ఇచ్చారా? అదుపులోకి తీసుకున్నారా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒక్క నరసరావుపేట గ్రామీణ ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు. పట్టణంలో గొడవలు జరిగిన ప్రాంతాలను సిట్ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, పోలీసు అధికారులు పరిశీలించారు. మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు - High Tension In Tadipatri

శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్‌ బృందం రెంటచింతల మండలంలో పర్యటించింది. రెంటాల, తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రదేశాలను సందర్శించారు. కారంపూడిలో ఘటనా స్థలాలను పరిశీలించిన అనంతరం స్టేషన్​ వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్​ సమీపంలోనే అల్లర్లు జరిగినా ఎందుకు త్వరగా అదుపు చేయలేకపోయారు? పరిస్థితి చేయిదాటేవరకూ ఏం చేశారని పోలీసులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటివరకూ ఇరుపార్టీల్లో ఎంతమందిని అరెస్టు చేశారని అడిగిన సిట్​ సభ్యులు కొన్ని ఎఫ్‌ఐఆర్‌ పత్రాల జిరాక్స్‌ ప్రతులు తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకుని సీఐ సురేంద్రబాబును విచారించారు. బాధితులను హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లు సమాచారం.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లెలో టీడీపీ పోలింగ్‌ ఏజెంటుపై కొటాల చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో అధికార పార్టీ శ్రేణులు దాడిచేశాయని గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చారు. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి జిల్లాలో జరిగిన విధ్వంసక ఘటనలపై డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ ప్రభాకర్‌ దర్యాప్తు చేశారు. శ్రీపద్మావతి వర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగా సిట్‌ అధికారులు పరిశీలించారు. ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే విషయాలు పరిశీలించారు. దాడి జరిగిన తర్వాత ఎంతసేపటికి అక్కడికి చేరుకున్నారు? నాని ఫోన్‌ చేసినా ఎందుకు స్పందించలేదని అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్​ బృందం దాడి ఎలా జరిగింది? ఎంతమంది పాల్గొన్నారు? నిందితులు ఎలా పారిపోయారు? ఘటనకు వినియోగించిన ఆయుధాల వివరాలు నమోదు చేసుకున్నారు.

అప్రమత్తమైన కడప పోలీసులు - జమ్మలమడుగులో 144 సెక్షన్​, హెచ్చరికలు జారీ - political clashes in andhra Pradesh

చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో దాడులు జరిగిన ప్రాంతాలను, దహనమైన కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని, వాహనాలను పరిశీలించారు. అక్కడ జరిగిన ఘటనలను సిట్‌ అధికారులకు గ్రామస్థులు వివరించారు. రాత్రి సుమారు 40 మంది గ్రామంపై పడి అరగంట పాటు దాడిచేశారని, ప్రతిదాడి జరిగిందని తెలిపారు. ఘటనపై గ్రామంలో అందరం ఓ చోట కూర్చుని ధర్నా చేశామని, ఇదే సమయంలో నాని కుమారుడు వినీల్‌ అక్కడికి వచ్చినట్లు వివరించారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ ఈశ్వర్‌ను విచారించి వివరాలు తీసుకున్నారు. గొడవలు, విధ్వంసాలు, హత్యాయత్న ఘటనలకు భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని సిట్‌ బృందం గుర్తించినట్లు సమాచారం. దాదాపు ఏడుగంటలపాటు విచారణ అనంతరం సిట్‌ ఐజీకి నివేదిక సమర్పించింది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాళ్లదాడి జరిగిన ఓంశాంతినగర్, చింతలరాయునిపాళెంలోని సూర్యముని ఇల్లు, ప్రభుత్వ కళాశాల మైదానం తదితర ప్రాంతాలను సిట్​ బృందం పరిశీలించింది. ఉదయం నుంచి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఉంటూ పలువురు పోలీస్‌ అధికారులను విచారించిన సిట్​.. గొడవలు ఎలా జరిగాయి? పోలీసుల పనితీరు గురించి వివరాలు సేకరించింది.

సిట్‌ అధికారులను కలవకుండా అడ్డుకున్నారని, గంటల తరబడి నిరీక్షించేలా చేశారని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం చివాట్లు పెడుతున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం, ఇంకా అధికార పార్టీకి కొమ్ముకాస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

రాష్ట్రంలో అల్లర్లపై సిట్​ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.