Loksabha MPs Oath : రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా, చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి గతంలోనే బాధ్యతలు స్వీకరించారు.
దగ్గుబాటి పురందేశ్వరి, కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీ భరత్, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, సీఎం రమేశ్, ఉదయ్ శ్రీనివాస్, హరీష్ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్ తదితరులు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.