Bad Roads in Andhra Pradesh : డబల్ రోడ్డు అయితే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రంలో రోడ్ల అధ్వాన్నస్థితిపై పొరుగు రాష్ట్ర మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు విదితమే. అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా పలు రోడ్లు ప్రభుత్వ పనితీరుకు దర్పనం పడుతున్నాయి. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం సమస్తం గుంతలు, గోతుల మయం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర రహదారులు అధ్వానంగా మారగా ఇక జిల్లా, గ్రామీణ స్థాయి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనదారుల అవస్థలు నిత్యకృత్యంగా మారాయి. బయటికి వెళ్లాలంటే అన్నింటికీ సిద్ధపడే ప్రయాణం చేస్తున్న దీనస్థితి ఏపీలో నెలకొంది.
ఆ రోడ్డుపై ప్రయాణం - వారంలో రెండుసార్లు షెడ్‌కు వాహనాలు
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి రోడ్ల ధ్వంసం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. అలసట లేని ప్రయాణం అనే విషయాన్ని వాహనదారులు ఎప్పుడో మర్చిపోయారు. అసమర్థ జగన్ పాలనలో రోడ్డెక్కాలంటేనే వారు భయపడుతున్నారు. కర్నూలు జిల్లాలో గుంతలమయంగా మారిన దారితో కొద్దిదూరం ప్రయాణాలకే ప్రమాదాల బారిన పడటం లేకుంటే నడుంనొప్పి వంటి సమస్యల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వానంగా ఒంగోలు రహదారులు - పట్టించుకోండి మహాప్రభో!
ఇది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె స్టేజీ నుంచి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల స్టేజీ వరకు 14 కిలోమీటర్ల పొడవు ఉన్న రహదారి. గోనెగండ్ల, దేవనకొండ మండలాల ప్రజలకు ఎంతో కీలకమైన రహదారి. ఈ రోడ్డు సుమారు 20 గ్రామాలను అనుసంధానిస్తుంది. 1996వ సంవత్సరంలో ఈ రోడ్డును తారుతో నిర్మించారు. కొంతకాలం బాగానే సేవలు అందించిన ఈ మార్గం కాలానుక్రమంలో పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 15 ఏళ్లుగా ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.
మూడేళ్లుగా నరకం చూస్తున్న ప్రజలు - రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణమంటేనే హడల్
గోనెగండ్ల, దేవనకొండ మండలాల రైతులు ఎమ్మిగనూరు మార్కెట్ కు తమ ఉత్పత్తులు తరలించాలన్నా, వైద్య అవసరాలకు ఆదోని వెళ్లాలన్నా ఈ మార్గంలోనే ప్రజలు రాకపోకలు సాగించాలి. నెల్లిబండ, బండగట్టు, గుమ్మరాళ్ల, ఎర్రబాడు, పిల్లిగుండ్ల, నెరుడుప్పల, ఈదుల దేవరబండ తదితర 20 గ్రామాలకు చెందిన 20 వేల మంది ప్రజలకు ఈ మార్గమే దిక్కు. ఆటోలు, కార్లు, అంబులెన్సులు ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. గతుకుల రోడ్డుతో అవస్థలు తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
గుంతల రహదారితో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని, అధ్వాన రహదారికి కనీసం మరమ్మతులైనా చేపట్టి తమకు నడుంనొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.
అడుగుకో గుంతతో ప్రజల పాట్లు - అధ్వానంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు