ETV Bharat / politics

ప్రత్యర్థులూ ఆయన్ను గౌరవిస్తారు- బాబు విజనరీ లీడర్​ : అర్నాబ్ గోస్వామి

Arnab Goswami's comments on TDP chief Chandrababu Naidu : దేశ రాజకీయాల్లో తృతీయ కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి అభ్యర్థులను నిర్ణయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రధానమంత్రి పదవిని అలంకరించే అవకాశాలున్నా సున్నితంగా తిరస్కరించి ఎన్​డీఏ కూటమి జాతీయ కన్వీనర్​గానూ విజయవంతమైన పాత్ర పోషించారు. 'మిస్టర్​ నాయుడు'గా జాతీయ మీడియా పిలుచుకొనే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్​ గోస్వామి ఏమన్నారంటే..

arnab_goswami_comments_on_tdp_chief_chandrababu_naidu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 1:48 PM IST

Updated : Mar 9, 2024, 4:49 PM IST

Arnab Goswami's comments on TDP chief Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్​. రాజకీయాల్లో ఆయన లెజెండ్. ప్రత్యర్థులు​ సైతం గౌరవించే అరుదైన నాయకుడు అని ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్​ గోస్వామి కొనియాడారు. దేశ రాజకీయాలపై చర్చ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

ఎన్డీఏలోకి చంద్రబాబు- ఏపీలో టీడీపీ,జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ

రాజకీయ పాత్రికేయుడిగా తన అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఆర్నాబ్ గోస్వామి.. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన సమయంలో తాను మైక్​ పట్టుకొని ఆయన వెంట పరిగెత్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు దేశానికి ఈ గవర్నెన్స్ (E Governance) పరిచయం చేశారని, డిజిటలైజేషన్ (Digitization) ​కు ఆద్యుడని పేర్కొన్నారు. విజనరీ నాయకుడు అని చెప్తూ.. నాయుడు సూచించిన వ్యక్తులే అప్పట్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతిగానూ నియమితులయ్యారని వెల్లడించారు. తాను అంత తేలిగ్గా పొగడ్తలు ఇచ్చేవాడిని కాదన్న ఆర్నాబ్..​ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలకు చాలా గౌరవం ఉందని అన్నారు. ప్రత్యర్థులు సైతం ఆయన్ను గౌరవిస్తారని చెప్పారు.

అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్​కల్యాణ్​ సమావేశం - పొత్తుపై చర్చ

జాతీయ మీడియా 'మిస్టర్​ నాయుడు'గా పిలుచుకొనే చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1995లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టిన చంద్రబాబు.. దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా తృతీయ ఫ్రంట్‌ (Third Front) ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో, ప్రధానమంత్రి అభ్యర్థులను ఎంపిక చేయడంలో చంద్రబాబు ‘కింగ్‌ మేకర్‌’గా మారారు. ఈ క్రమంలో చంద్రబాబు సహకారంతో దేవెగౌడ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బయట నుంచి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పట్టుబట్టడంతో తుదకు ఐకే గుజ్రాల్​ ప్రధాని అయ్యారు. ధర్డ్ ఫ్రంట్​ జాతీయ కన్వీనర్‌గా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు.

మలి విడత అభ్యర్థుల ఎంపికపై టీడీపీ-జనసేన కసరత్తు - నేడు దిల్లీకి చంద్రబాబు

ఇక.. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని దక్కించుకుంది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లు సాధించింది. 29 ఎంపీ సీట్లు గెలుచుకున్న టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్​డీఏ(NDA) సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2004 వరకూ ఎన్డీఏ కూటమికి చంద్రబాబు కన్వీనర్‌గా వ్యవహరించగా ఆ సమయంలో మోదీ గుజరాత్​ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాష్ట్రపతి స్థానంలో దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికలోనూ చొరవ తీసుకున్న చంద్రబాబు ఆయన అనంతరం అబ్దుల్‌ కలాం పేరును ప్రతిపాదించారు.

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

Last Updated : Mar 9, 2024, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.