ETV Bharat / politics

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం- మోదీ ఆత్మీయ ఆలింగనం - ap new cm cbn - AP NEW CM CBN

CBN TEAM OATH CEREMONY : ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ అబ్దుల్​ నజీర్​ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి కాగా, ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం మంత్రులుగా పవన్‌కల్యాణ్‌, నారా లోకేష్‌ ప్రమాణస్వీకారం చేశారు.

cbn_team_oath_cermony
cbn_team_oath_cermony (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 12:05 PM IST

Updated : Jun 12, 2024, 4:36 PM IST

CBN TEAM OATH CEREMONY : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో మారు ఎన్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు సహా 25 మంత్రుల తో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి మంత్రులంతా దైవ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మంత్రులంతా తమ ప్రమాణంలో అంతః కరణ శుద్ధి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ జాగ్రత్త పడ్డారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం- మోదీ ఆత్మీయ ఆలింగనం (ETV Bharat)

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాలు మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రి గా ఆయన ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు తో ప్రమాణం చేయించారు. చంద్రబాబునాయుడు అనే నేను పదం పలకగానే వేదిక వద్ద కోలాహలంగా మారింది. సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న తరుణంలో కేరింతలు ఉత్సాహం గా నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు.

మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్- సామాజిక న్యాయానికి పెద్దపీట - AP New Cabinet Ministers List

చంద్రబాబు తో పాటు ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులు గా జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు, టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు.

అసాధారణ రాజకీయ దురంధరుడు - ఆయనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు - Chandrababu Political Life story

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోది తో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్‌, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

cbn_team_oath_cermony
cbn_team_oath_cermony (ETV Bharat)

ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక మంత్రులతో చంద్రబాబు నాయుడు గ్రూప్‌ ఫొటో దిగారు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ అ‍గ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా తన దగ్గరకు వచ్చిన ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైతో సీరియస్ గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపై సీరియస్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది.

కేంద్రమంత్రుల్లో 99శాతం మంది కోటీశ్వరులే- అందుకోలేనంత ఎత్తులో పెమ్మసాని - ADR Report On Central Ministers

Last Updated : Jun 12, 2024, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.