MP Ramesh Allegations Against CM Jagan: జగన్మోహన్ రెడ్డి జీవితమే ఒక నాటకం ఆయన ప్రజల ముందు ఎలా ఉంటాడో ఇంటికెళ్లాక ఎలా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమేనని రాజ్యసభ సభ్యులు రమేష్ అన్నారు. కడపలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రమేష్ మీడియాతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్పై విమర్శలు గుప్పించారు. వైసీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇలాంటి జగన్నాటకం ముందు వెనుక ఎవరు వెయ్యలేరని రమేష్ స్పష్టం చేశారు.
బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధం - ప్రజలతో మమేకానికి జగన్ కొత్త వ్యూహాలు
దేశంలో ఉన్న విలువైన గనులలో అన్నమయ్య జిల్లా మంగంపేటలో ఉన్న గనులు ఒకటి అని అన్నారు. అక్కడి గనుల నుంచి ఎంతో విలువైన సంపద బయటికి వెళ్తోందని అన్నారు. అలాంటి గనిని ఎలాంటి టెండర్లు వేయకుండా మరో ఐదేళ్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన ఓ వ్యక్తికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామని అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని లేదా మంగంపేట గనుల వద్దే దీక్షలు చేపడుతామని ఆయన అన్నారు.
అవమానాలు, అనిశ్చితికి తెర - ఎంపీ లావు రాజీనామాకు కారణమదే!
కేవలం మేడా రఘునాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డికి చెందిన వర్గీయులకు మాత్రమే టెండర్ నిధులను విడుదల చేస్తున్నారని విమర్శించారు. మరో వ్యక్తి జవహర్ రెడ్డి కూడా ఉన్నారని ఆయనకు ప్రతి పనిలో 10% కమిషన్ ఇస్తేనే డబ్బులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరో 75 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. షర్మిల తన ప్రసంగంలో చేస్తున్న మాటలకు జగన్మోహన్ రెడ్డి సమాధానము ఇవ్వలేకపోతున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే, ఎంపీల ఝలక్, మాట మార్చిన జగన్ - ఓడిపోయినా విచారం లేదని వెల్లడి!
ఒక ఆరోగ్యశ్రీ డబ్బులే కాదు ఎక్కడా కూడా డబ్బులు విడుదల చేయడం లేదని, కడప జిల్లాలో దొరికే ఖనిజ సంపదను మొత్తం జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి బ్రతుకేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకులు ఇష్టం వచ్చినట్టు భూకబ్జాలు చేస్తున్నారని ఎక్కడ ఖాళీ భూమి కనబడితే అక్కడ జెండా పాతేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా వారి అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎలా ఉందో అందరికి తెలుసు ఎందుకంటే ఇప్పడున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అందుకని సీఎం జగన్ని ఎప్పడెప్పుడు ఇంటికి పంపించాలా అని ప్రజలు సిద్దంగా ఉన్నారు. ప్రపంచ దేశాలలో ఉన్న గనులలో అన్నమయ్య జిల్లాలో ఉన్న మంగంపేట ఒకటి. గనుల నుంచి ఎంతో విలువైన సంపద బయటికి వెళ్తోంది. అలాంటి గనిని ఎలాంటి టెండర్లు వేయకుండా మరో ఐదేళ్ల కు ఓ వ్యక్తికి కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.- సీఎం రమేష్, ఎంపీ