ETV Bharat / politics

రైతులకు అండగా ఉంటాం - 48 గంట‌ల్లోనే ధాన్యం డ‌బ్బులు : మంత్రి నాదెండ్ల - NADENDLA MANOHAR VISIT VIZIANAGARAM

విజయనగరం జిల్లాలో ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ - రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆరా

nadendla_manohar_visit_vizianagaram
nadendla_manohar_visit_vizianagaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 7:47 PM IST

Minister Nadendla Manohar Visit Grain Purchasing Center: రైతుకు అన్ని విధాలా అండ‌గా నిలబ‌డ‌తామ‌ని పౌర స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. కొనుగోలు చేసిన 48 గంట‌ల్లోనే ధాన్యం డ‌బ్బులు జ‌మ చేస్తున్నామ‌ని చెప్పారు. విజయనగరం జిల్లాలోని డెంకాడ మండ‌లం చంద‌క‌పేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సంద‌ర్శించారు. ధాన్యం దిగుబ‌డి, కొనుగోలు ప్రక్రియ‌, ర‌వాణా, న‌గ‌దు జ‌మ, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను, అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. కూటమి ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం అంకిత భావంతో ప‌నిచేస్తోంద‌ని మంత్రి చెప్పారు.

గ‌త ప్ర‌భుత్వం రైతుల‌ను దుర్మార్గంగా మోసం చేసింద‌ని, సుమారు రూ.1674 కోట్ల ధాన్యం డ‌బ్బులు బ‌కాయి పెట్టింద‌ని అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల్లోనే అన్ని బ‌కాయిల‌ను పూర్తిగా చెల్లించింద‌ని మంత్రి నాదెండ్ల వివరించారు. సుమారు 6 నెల‌ల‌పాటు క‌ష్టపడి పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌ను అందించాల‌న్న‌ది సీఎం, డిప్యూటీ సీఎం ధ్యేయ‌మ‌ని, దీనికి అనుగుణంగానే ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను రూపొందించామ‌ని తెలిపారు. గ‌తంలోలా కాకుండా రైతులు త‌మ‌కు న‌చ్చిన మిల్లుకు ధాన్యం త‌ర‌లించ‌వ‌చ్చున‌ని సూచించారు.

"పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తాం" - డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్

రైతుల‌కు 2000 టార్పాలిన్లు: తేమ‌ 17 శాతం వ‌ర‌కు అనుమ‌తి ఉంద‌ని, 5 కిలోలు అద‌నంగా తీసుకొని, తేమ 24 శాతం వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ కొనుగోలు చేయాల‌ని ఆదేశాలు ఇచ్చామ‌ని వివ‌రించారు. గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి జిల్లాలో కేవ‌లం 9,100 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు జ‌ర‌గ్గా, ఈ ఏడాది 78వేల మెట్రిక్ ట‌న్నుల‌ను కొనుగోలు చేశామ‌ని మంత్రి చెప్పారు. 24 గంట‌ల్లోనే సుమారు 16,000 మంది రైతుల‌కు రూ.174 కోట్లు చెల్లించామ‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల‌కు ఎటువంటి సాయం చేయ‌లేద‌ని, ట్రాక్ట‌ర్లు, డ్ర‌య్య‌ర్లు, క‌నీసం టార్పాలిన్లు సైతం ఇవ్వ‌లేద‌ని వివరించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని సుమారు 2000 టార్పాలిన్ల‌ను రైతుల‌కు అందించామ‌ని చెప్పారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా సుమారు 32 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం సేక‌రించాల‌ని ఈ ఏడాది ల‌క్ష్యంగా నిర్ణ‌యించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 13,24,000 ట‌న్నుల‌ను సేక‌రించామ‌ని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితి అనుకూలంగా లేని స‌మ‌యంలో రైతులు అధికారుల సూచ‌న‌లు పాటిస్తూ, వ‌రికోత‌లు కోయకుండా ఉండాల‌ని, ధాన్యం త‌డిచిపోకుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. రైతులు ఇబ్బంది ప‌డ‌కుండా, ఏఐ టెక్నాల‌జీతో ట్ర‌క్‌షీట్ల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. పంట దిగుబ‌డి పెంచేందుకు వ్య‌వ‌సాయాధికారులు రైతుల‌కు స‌ల‌హాల‌ను అందించాల‌ని మంత్రి నాదెండ్ల కోరారు.

'పరిశీలన తర్వాత సందేహాలు పెరిగాయ్‌' - విశాఖ డెయిరీపై ఆడిట్ జరగాల్సిందే : ప్రత్యేక హౌస్ కమిటీ

కొనసాగుతున్న అల్పపీడనం - ధాన్యంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.