Vijayasai Reddy affair : వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్మోహన్ దిల్లీలో ధర్నా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ డీఎన్ఏ టెస్టుకు ముందుకు రావాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త డిమాండ్ చేశారు. తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంపై వివాదం తీరాలని దిల్లీలో ఆయన డిమాండ్ చేశారు.
#WATCH | Protest staged against YSRCP leader Vijay Sai Reddy at Jantar Mantar, Delhi demanding to cancel his membership from the Parliament and conduct his DNA test.
— ANI (@ANI) July 24, 2024
Madan Mohan Manipatty, husband of the victim, says " they have captured my wife and they had an illegal baby. my… pic.twitter.com/JJnywJfvHr
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను చెరబట్టారంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్ మోహన్ మణిపట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తాను విదేశాల్లో ఉంటున్న సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకుని వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారని మదన్ మోహన్ తెలిపారు. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా బుధవారం ఆయన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపారు. విజయ సాయిరెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ న్యాయవాది సుభాష్ తన భార్యను లోబరుచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. వారితో తన భార్య చట్ట వ్యతిరేకంగా బిడ్డను కని ఇచ్చిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో పాటు న్యాయవాది సుభాష్‌కు డీఎన్ఏ టెస్టు చేయించాలని లేదంటే ఆయనను రాజ్యసభ నుంచి తప్పించాలి డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తానని మదన్ మోహన్ చెప్పారు.
విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని తన భార్య శాంతికుమారి చెప్పిందని, ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చానని మరోసారి చెప్పిందని మదన్ మోహన్ గతంలో ఆరోపణలు చేశారు. తాను భార్యకు దూరంగా అమెరికాలో ఉంటున్నపుడు ఇదంతా జరిగిందని చెప్పారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు శాంతి జన్మనిచ్చినట్లుగా రికార్డులు క కూడా ఉన్నాయని వెల్లడించారు. ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్ పేరు ఉందని, ఆయనను సంప్రదిస్తే శాంతికి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని వివరించారు. శాంతికి, తనకు కవల పిల్లలు ఉన్నారని మదన్మోహన్ తెలిపారు. ఇదిలా ఉండగా తనపై వచ్చినవి అసత్య ఆరోపణలుగా విజయసాయి రెడ్డి గతంలో ట్విటర్లో స్పందిస్తూ ఖండించారు.