Kadapa Lok Sabha Constituency: ఏపీ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉన్న కడప లోక్‌సభ నియోజవర్గం 1952లో ఆవిర్భవించింది. మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉన్న ఈ పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ ఇప్పటికి పది సార్లు విజయం సాధించింది. గడిచిన 9ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులు ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఈ సారి వైఎస్సార్సీపీ తరఫున అవినాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం జగన్ ఇలాఖాలో ఆయన నిలబెట్టిన అభ్యర్థిని ఓడించేందుకు చెల్లెళ్లు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందో? వేచి చూడాల్సిందే.
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:
ప్రస్తుతం ఈ నియోజకవర్గం పరిధిలో 7అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
- కడప
- పులివెందుల
- కమలాపురం
- జమ్మలమడుగు
- ప్రొద్దుటూరు
- మైదుకూరు
- బద్వేలు(ఎస్సీ)
2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:
- మొత్తం ఓటర్ల సంఖ్య- 16.18 లక్షలు
- ఓటర్లలో పురుషుల సంఖ్య- 7.93 లక్షలు
- మహిళా ఓటర్ల సంఖ్య- 8.25 లక్షలు
- ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 224
కడప లోక్‌సభ నియోజకవర్గంలో 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ 4సార్లు, కాంగ్రెస్ పార్టీ 10సార్లు, తెలుగుదేశం పార్టీ ఒకసారి విజయం సాధించగా, రెండుసార్లు వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.ఎస్.అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.
ప్రస్తుత ఎన్నికలకు బరిలో ఉన్న అభ్యర్థులు: 2024 లోక్‌సభ ఎన్నికలకు వైఎస్సార్సీపీ నుంచి అవినాష్‌రెడ్డి మరోసారి టికెట్ దక్కించుకోగా టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డి బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తుండటంతో ఈసారి కడప పార్లమెంట్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.
గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు:
- 1952: ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి(సీపీఐ)
- 1957: వీఆర్ రెడ్డి(కాంగ్రెస్)
- 1962: ఎ.ఈశ్వర్‌రెడ్డి(సీపీఐ)
- 1967: ఈశ్వర్‌రెడ్డి(సీపీఐ)
- 1971: ఎ.ఈశ్వర్‌రెడ్డి(సీపీఐ)
- 1977: కందుల ఓబుల్‌రెడ్డి(కాంగ్రెస్)
- 1980: ఓబుల్‌రెడ్డి(కాంగ్రెస్)
- 1984: డీఎన్ రెడ్డి(టీడీపీ)
ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:
- 1989: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(కాంగ్రెస్)- ఎం.వి రమణారెడ్డి(టీడీపీ)
- 1991: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(కాంగ్రెస్)- సి. రామచంద్రయ్య(టీడీపీ)
- 1996: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(కాంగ్రెస్)- కందుల రాజమోహన్ రెడ్డి(టీడీపీ)
- 1998: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(కాంగ్రెస్)- కందుల రాజమోహన్ రెడ్డి(టీడీపీ)
- 1999: వైఎస్ వివేకానందరెడ్డి(కాంగ్రెస్)- కందుల రాజమోహన్ రెడ్డి(టీడీపీ)
- 2004: వైఎస్ వివేకానందరెడ్డి(కాంగ్రెస్)- ఎం.వి మైసూరారెడ్డి(టీడీపీ)
- 2009: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(కాంగ్రెస్)- పాలెం శ్రీకాంత్ రెడ్డి(టీడీపీ)
- 2014: వైఎస్ అవినాష్‌రెడ్డి(వైఎస్సార్సీపీ)- డి.ఎల్ రవీంద్రరెడ్డి(కాంగ్రెస్)
- 2019: వైఎస్ అవినాష్‌రెడ్డి(వైఎస్సార్సీపీ)- సి.ఆదినారాయణ రెడ్డి(టీడీపీ)