ETV Bharat / politics

వెలుగులోకి మాజీ మంత్రి జోగి రమేష్​ భూకబ్జా బాగోతం- పార్టీ కూడా వదిలించుకుంటుందా? - jogi ramesh land mafia - JOGI RAMESH LAND MAFIA

jogi ramesh land mafia : మాజీ మంత్రి జోగి రమేష్​ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుచరులతో కలిసి తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించాడని ఓ బాధితుడు మంత్రులను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి రమేష్​ను తప్పించారని ప్రచారం జరుగుతోంది.

exminister_jogi_ramesh_land_mafia
exminister_jogi_ramesh_land_mafia (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 7:40 PM IST

Updated : Jul 8, 2024, 7:54 PM IST

jogi ramesh land mafia : మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాస రెడ్డి పెడన నియోజకవర్గంలోని తన భూమిని ఆక్రమించారని బంటుమిల్లికి చెందిన రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించి భూములు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్ అండతోనే భూ ఆక్రమణ సాగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. వీరి అక్రమాలకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా ఉన్నారని ఆరోపించారు. భూమిని ఇప్పించి న్యాయం చేయాలంటూ బాధితుడు రంగబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.

ఖాళీగా ఉందని కబ్జా చేశారు- అగ్రిగోల్డ్‌ భూములను కొట్టేసిన మాజీ మంత్రి జోగి రమేశ్​ - Jogi Ramesh land grab

భూములు అమ్ముకోవడానికి వీల్లేకుండా వివాద జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నట్లు వాపోయారు. ఆ జాబితా నుంచి తమ భూములను తప్పించి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జోగికి 15 లక్షల రూపాయలు లంచం ఇచ్చామని తెలిపారు. తమకున్న 30 ఎకరాల భూమికి జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి దొంగ దస్తావేజులు తయారు చేయిస్తున్నారన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్​ ద్వారా దొంగ దస్తావేజులతో తన భూమిని అమ్మేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ మాజీ మంత్రి జోగికి సహకరిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్ చేసే అక్రమాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ పాత్ర కూడా ఉందని అన్నారు. ఐజీ రామకృష్ణకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. త్వరలో సబ్ రిజి స్ట్రార్ల బదిలీలు జరిగే లోగా తన భూమిని వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ స్టేషనులో కూడా ఫిర్యాదు చేశానని రంగబాబు తెలిపారు.

తొడకొట్టి మీసాలు మెలేసి జోగి తనయుడి వీరంగం - ఎన్డీఏ శ్రేణులను రెచ్చగొట్టే యత్నం - Jogi Ramesh Son Rajeev Overaction

పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జోగి రమేష్‌ను మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జోగి రమేష్‌ నియోజకవర్గానికి వచ్చిన దగ్గర నుంచి వివాదాలమయంగా మారడంతో కార్యకర్తలు, నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత జోగి రమేష్‌ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు జోగి రమేష్‌ పేరు, ఫొటో కూడా లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు. సనత్ నగర్ లో నిర్వహించిన వైఎస్ జయంతి కార్యక్రమంలో పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త స్థానంలో దేవభక్తుని చక్రవర్తి ఫొటోతో కార్యకర్తలు బ్యానర్లు వేశారు. కాబోయే పెనమలూరు ఎమ్మెల్యే అంటూ చక్రవర్తి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సతన్ నగర్ లో నిర్వహించిన వైఎస్ జయంతి కార్యక్రమానికి జోగి రమేష్‌ వస్తారని తొలుత ప్రచారం జరిగింది కానీ ఆయన రాలేదు. నియోజకవర్గ బాధ్యతల నుంచి జోగి రమేష్‌ తప్పుకున్నాడని కార్యకర్తలు భావిస్తున్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ యత్నం- జోగి రమేష్ ఫొటోలతో ముద్రించిన సంచులు స్వాధీనం - EC Seize Jogi Ramesh Gift Articles

Last Updated : Jul 8, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.