CM Revanth Reddy Serious on Police Over Handcuffing to Farmer: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా "లగచర్ల దాడి" కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు ఈర్యా నాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ఈర్యా నాయక్‌కు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఛాతీనొప్పి రావడంతో రైతు ఈర్యా నాయక్‌కు మొదట సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ఈర్యా నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. గతంలోనూ ఛాతీ నొప్పి వచ్చినందున గాంధీకి తరలిస్తున్నామని అన్నారు.
పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం - సీరియస్‌గా ఫాలో అప్ చేయండి : సీఎం చంద్రబాబు
'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' - ఆరు నెలల పాలనపై చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే!