ETV Bharat / politics

వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులైతే - ప్రభుత్వ, ప్రజలు సొమ్ములు ఏమైనట్లు జగన్? - Public Satires On YSRCP Candidates

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 7:10 AM IST

CM Jagan Introduced YSRCP MLA Candidates: అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివాళ్లేనట! సిద్ధం పేరుతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న సీఎం జగన్‌ తన బస్సులో 'మంచివాడు, సౌమ్యుడు' అన్న సర్టిఫికెట్లనూ పెట్టుకుని తిరుగుతున్నట్టున్నారు! అందరూ సౌమ్యులే అయితే దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో సీఎం చెప్పగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

CM Jagan Introduced YSRCP MLA Candidates

వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులైతే - ప్రభుత్వ, ప్రజలు సొమ్ములు ఏమైనట్లు జగన్?

CM Jagan Introduced YSRCP MLA Candidates : అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివాళ్లేనట! సిద్ధం పేరుతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న సీఎం జగన్‌ తన బస్సులో 'మంచివాడు, సౌమ్యుడు' అన్న సర్టిఫికెట్లనూ పెట్టుకుని తిరుగుతున్నట్టున్నారు! పార్టీ అభ్యర్థులందరికీ బీఫాంల కంటే ముందు ఆయన ఈ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సింగపల్లెలో శనివారం ఎన్నికల ప్రచార సభలో పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ అందరికీ మంచివాడు, సౌమ్యుడు అని కితాబిచ్చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా నియోజకవర్గాల్లో నాయకుల వ్యవహారశైలి, దందాలతో విసిగిన ప్రజలు సీఎం మాటలు విని 'అవునా నిజమా?' అని ముక్కున వేలేసుకున్నారు. అందరూ సౌమ్యులే అయితే దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో సీఎం చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు.

యు.వి.రమణమూర్తిరాజు(కన్నబాబు) : అభివృద్ధి చేయలేదనో, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో, ఏదైనా పథకం తమకెందుకివ్వలేదనో నియోజకవర్గ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు కన్నబాబు అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఆయన నోటి నుంచి బూతులు ప్రవాహంలా వచ్చేస్తాయి. 'గట్టిగా మాట్లాడితే పళ్లు పీకేస్తా' అని బెదిరింపులకూ దిగుతారు. అలాంటి కన్నబాబుకే సౌమ్యుడని సీఎం కితాబివ్వడంతో జనం ఆశ్చర్యపోయారు. మరి ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కరిగిన కొండలకు, మాయమైన మట్టికి బాధ్యులెవరో కూడా సీఎం చెప్పొచ్చు కదా? అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అచ్యుతాపురం సెజ్‌లోకి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోతే పనులు అడ్డుకునేదెవరో వివాదాస్పద భూములపై వాలిపోయేదెవరో సీఎం కాస్త కనుక్కుని ప్రజలకు వివరించి ఉంటే బాగుండేది.

'అయ్‌ బాబోయ్‌ చాలా గొప్పోరండి మీరు' - జగన్‌ అభ్యర్థుల పరిచయ వ్యాఖ్యలతో జనం నవ్వులు - Public Satires on YSRCP Candidates

పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ : ప్రతిపక్ష నేతలపై బండబూతులతో విరుచుకుపడే గణేష్‌ ఎంత సౌమ్యుడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గిరిజనులు వ్యతిరేకించినా లెక్కచేయకుండా లేటరైట్‌ క్వారీల తవ్వకాలకు మార్గం సుగమం చేసిన వాళ్లెవ్వరో గణేష్‌కు బాగా తెలుసునని నియోజకవర్గ ప్రజలంటున్నారు. అనుచరగణంతో దందాలు చేస్తున్నవారు, ఇసుక, మట్టి యథేచ్ఛగా తవ్వేస్తున్నవారు, కొవిడ్‌ సమయంలో ఆసుపత్రిలో మాస్క్‌ ఇవ్వలేదని అడిగిన ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌ను ఇబ్బందులకు గురిచేసిన వారెవరో గణేష్‌కు బాగా తెలుసునని వారెవరో సీఎం కనుక్కుని చెబితే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కరణం ధర్మశ్రీ : నియోజకవర్గంలో తరతమ భేదాలు లేకుండా ఏ పనికైనా కమీషన్లు పిండేసే ఇసుక, కంకర, మట్టి తవ్వకాల్లో వాటాలు నొక్కేసే వాళ్లెవరో ధర్మశ్రీకి బాగా తెలుసునని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తూ, సోదరుడితో అన్ని పనులూ చక్కబెడుతున్న వాళ్లెవరో ధర్మశ్రీనే అడిగి చెప్పాలని కోరుతున్నారు. పార్టీ కార్యకర్తల్ని, ఉద్యోగుల్ని బెదిరించి చిట్‌లు కట్టించుకుంటున్నవారి సమాచారమూ ధర్మశ్రీ వద్దే ఉందని అంటున్నారు. అవేంటో ముఖ్యమంత్రే తెలుసుకుని మాకు కూడా చెప్పొచ్చు కదా? అని ప్రజలు అడుగుతున్నారు.

వీళ్లందరూ మంచోళ్లైతే - ఇన్నాళ్లు జనాన్ని ముంచిందేవరో చెప్తారా జగన్ గారు! - YSRCP MLA Candidates

అదీప్‌రాజ్‌ : నియోజకవర్గంలో ఐదేళ్లలో చెరువుల్ని కబ్జా చేసినవాళ్లు, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని దొంగ పత్రాలు సృష్టించిన వారెవరో అదీప్‌కి బాగా తెలుసునని అంటున్నారు. సింహాచలం దేవస్థానం భూములపై అనుచరుల ద్వారా కన్నేసిన వాళ్లెవరో అదీప్‌కు బాగా తెలుసని చెబుతున్నారు. ఆ వివరాలేంటో కాస్త ఆయన్నే అడిగి తెలుసుకుని చెప్పండి జగన్‌ అని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

బూడి ముత్యాలనాయుడు : మరి రియల్టర్లతో జట్టుకట్టి దేవాదాయ భూములను దోచుకున్నది ఎవరు? బినామీలను అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలోని రోడ్లు, భవనాల కాంట్రాక్టు పనులన్నీ సొంతంగా చేసుకున్నదెవరు? శారదా నదిలో ఇసుక మొత్తాన్ని అనుచరులకు అప్పగించిందెవరు? ఈ ప్రశ్నలకు జవాబులు ముత్యాలనాయుడినుంచే తెలుసుకుని సీఎం తమకు చెప్పాలని స్థానికులు కోరుతున్నారు.ఈర్లె

అనురాధ : నియోజకవర్గంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పుతోందెవరో, సెటిల్‌మెంట్లు చేస్తూ కోటపాడు మండలంలో డి.పట్టా భూముల్ని గుప్పిట్లోకి తెచ్చుకున్న వారెవరో అనురాధకు బాగా తెలుసునని ప్రజలనుకుంటున్నారు.

ఏంటీ వీళ్లు మంచోళ్లా? - ఒకసారి ఈ అరాచకాలు చూద్దామా జగన్? - CM Jagan Lies about YCP Candidates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.