CM Jagan Ongole Tour: ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు రానున్నారు. ఒంగోలులో దాదాపు 20వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ (House Sites Distribution) కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎన్. అగ్రహారం విచ్చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన (CM Jagan Tour) దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బందోబస్తు కోసం 17వందల మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే సీఎం సభకు డ్వాక్రా మహిళలంతా రావాల్సిందేనని, పట్టాలు పొందుతున్న లబ్ధిదారులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని మహిళలపై ఆర్పీలు ఒత్తిడి చేస్తున్నారు.
సీఎం సభ కోసం దారి మళ్లింపు- వందల కి.మీ చుట్టూ తిరిగెళ్లాల్సి వస్తోందని లారీ డ్రైవర్ల గగ్గోలు
సీఎం జగన్ సభ కోసం భారీ జన సమీకరణపై అధికార వైసీపీ (YSRCP) దృష్టి పెట్టింది. డీఆర్డీఏ (DRDA), మెప్మా (Mepma) అధికారులు, సిబ్బంది ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సభకు రాకపోతే పథకాలు ఆగిపోతాయని మహిళలను హెచ్చరిస్తున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులు కాకున్నా సరే, మహిళలంతా హాజరుకావాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. స్థలం పొందిన కుటుంబాల్లోని మహిళలకు చీరలు (Sarees), పురుషులకు ప్యాంట్లు (Pants), షర్టులు (Shirts) ఇస్తారంటూ కొన్నిచోట్ల ప్రచారం చేస్తున్నారు.
సీఎం జగన్ సభకు స్కూల్ బస్సులు - సెలవు ప్రకటించిన విద్యా సంస్థలు
జగన్ సభకు 500 ఆర్టీసీ బస్సులు: ఇళ్ల పట్టాల పంపిణీ సభ కోసం జనాన్ని తరలించటానికి నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి దాదాపు 500 ఆర్టీసీ బస్సులు (RTC Buses) ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా జిల్లా నలుమూలల నుంచి 400కు పైగా ప్రైవేట్, పాఠశాలల బస్సులు కూడా సిద్ధం చేశారు. దీంతో ఆయా పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ఒంగోలులో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ (House Sites Distribution Program at Ongole) కార్యక్రమానికి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం జగన్ సభకు ప్రజల నుంచి రాని స్పందన - ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు
జర్నలిస్టులకు నో ఎంట్రీ: సీఎం జగన్ పాల్గొంటున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఫొటో, వీడియో జర్నలిస్టులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన విలేకరులను మాత్రమే అనుమతిస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
సీఎం సభతో సామాన్యులకు తప్పని తిప్పలు - బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు