CM Chandrababu Chit Chat with Media: మద్యం టెండర్లలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించనన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు మద్యం టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని ప్రజలకు మంచి చేయడానికే పొలిటికల్ గవర్నెన్స్ ఉపయోగించుకోవాలన్నారు. వర్షాలు, వరదల వల్లే ఇసుక తవ్వకాలు నిలిచిపోయి కొంత ఇబ్బంది ఎదురైందని రాత్రిపూట తవ్వకాలు జరపకూడదన్న ఎన్జీటీ నిబంధనలు కూడా అడ్డంకిగా మారాయని చంద్రబాబు వెల్లడించారు.
30 జిల్లాల ఏర్పాటులో వాస్తవం లేదు: వీలైనంత తక్కువ ధరకు ఇసుక సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారులతో కొన్ని తప్పులు చేయించిందని ఇప్పుడు వారందరినీ పక్కనపెట్టడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో అధికారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇప్పుడు వీళ్లను కూడా పక్కన పెట్టేస్తే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉండదన్నారు. 30 జిల్లాల ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పొలిటికల్ గవర్నన్స్ అంటే అన్నింట్లోనూ తలదూర్చటం కాదని స్పష్టం చేశారు. మద్యం టెండర్లలో ఎక్కువ పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆదాయం కోసం పోటీ పెంచుతారా అని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వర్షాలు, వరదల వల్ల డిమాండ్‌కు తగినట్లు ఇసుక లభ్యత లేదని సీఎం వివరించారు. ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రిపూట ఇసుక తవ్వలేమని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాలని అన్నారు. ఇసుక సరఫరాపై మేం కూడా ఆందోళన చెందుతున్నామని వివరించారు. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా తక్కువే ఉన్నారన్న సీఎం వాణిజ్య పన్నులకు ఇంతవరకు కమిషనర్‌ను ఇవ్వలేకపోయమని తెలిపారు.
అసభ్య పదజాలానికి వైఎస్సార్సీపీ మారు పేరు - బూతులు ఆ పార్టీ నేతల పేటెంట్ : చంద్రబాబు
జగన్ పాలనలో నేనే ఎక్కువ ఇబ్బంది పడ్డా: గత ఐదేళ్ల జగన్ పాలనలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. నన్ను అరెస్టు చేసి ఉంచిన జైలు మీద డ్రోన్లు కూడా ఎగురవేశారని తెలిపారు. నా ప్రతి కదలిక గమనించేందుకు జైలుగదిలో సీసీ కెమెరా పెట్టారని వివరించారు. జైలులో వేడినీరు ఇవ్వలేదని దోమలు కుడుతున్నా పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఇన్ని చేసిన కక్షలు తీర్చుకునే స్వభావం నాది కాదని అన్నారు. తప్పు చేసినవారు తప్పించుకోలేరని కచ్చితంగా చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. తప్పుడు పోస్టులు, నకిలీ ప్రచారంపై ఓపిక పడుతున్నానని మితిమీరి ప్రవర్తిస్తే ఏం చేయాలో కూడా తెలుసని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అవసరం. గ్రీన్‌ఫీల్డ్ హైవేను బందరు పోర్టుకు అనుసంధానిస్తే హైదరాబాద్‌లోనూ డ్రై పోర్టు వస్తుంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను సమీక్షిస్తున్నా. పలుసార్లు దిల్లీ వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయి. త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో విడత భర్తీ ఉంటుది. - చంద్రబాబు, సీఎం
హర్యానాలో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం - జమిలి ఎన్నికలతో దేశానికి మేలు : సీఎం చంద్రబాబు
వరద సాయంపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమా? : మంత్రులు