ETV Bharat / politics

'హూ కిల్డ్ బాబాయ్​'కి త్వరలోనే సమాధానం వస్తుంది: చంద్రబాబు - Who Killed Babai - WHO KILLED BABAI

CM Chandrabab Speech in Assembly : కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పారు. జగన్‌ పాలనలో మంచి రాష్ట్రం సర్వ నాశనమైందని, హూ కిల్డ్‌ బాబాయ్‌ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని తెలిపారు.

cm_speech_in_assembly
cm_speech_in_assembly (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 3:14 PM IST

Updated : Jul 23, 2024, 3:50 PM IST

CM Chandrabab Speech in Assembly : రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంసం ఫలితంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్‌ కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొందని, రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్‌ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రికి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు ప్రకటించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని, రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయంపై బడ్జెట్‌లో పెట్టారని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.

పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకు నాంది పలికాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. విజన్‌ 2020 తయారుచేశాక అభివృద్ధి ప్రారంభించామని చెప్తూ ఆనాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చామని, ఇవాళ మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కనిపించే పరిస్థితి ఉందన్నారు. వికసిత్‌ భారత్‌ 2047వరకు ప్రపంచంలోనే భారత్‌ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయన్న చంద్రబాబు 93 శాతం స్ట్రైక్‌ రేట్‌.. 57 శాతం కూటమికి ఓట్లు పడ్డాయని వివరించారు.

తన రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి ఫలితాలు చూడలేదన్న చంద్రబాబు ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉందని చెప్పారు. గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామని, జైలుకు వచ్చి పవన్‌కల్యాణ్‌ పరామర్శించారని గుర్తు చేశారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్‌ ముందుకొచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని మొదటగా పవన్‌ చెప్పారని, ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చిందని వివరించారు. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసేవరకు సమష్టిగా ముందుకెళ్తామని చెప్పారు.

ఓటు వేయడానికి లక్షలు ఖర్చు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వచ్చారని, రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఒకే ఒక లక్ష్యంతో వచ్చి ఓటు వేసి వెళ్లారని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు.. ఎంతసేపైనా ఓపిగ్గా ఉండి ఓటు వేసి గెలిపించిన అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులు అని చంద్రబాబు అభివర్ణించారు. ఎక్కడా భూముల్ని, ఆస్తులను వేటినీ వదల్లేదని, మెడపై కత్తి పెట్టి తమ పేరుపై భూములు రాయించుకున్న ఘటనలు చూశామని అన్నారు. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు ఒకటికాదు అన్నీ చూశామని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ గాడిలో పడుతోందన్న చంద్రబాబు గత ఐదేళ్ల జగన్‌ పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారని, అహంకారంతో విర్రవీగి అసమర్థతతో వ్యవస్థలు నాశనం చేశారని మండిపడ్డారు. జగన్‌ పాలనలో మంచి రాష్ట్రం సర్వ నాశనమైందని, హూ కిల్డ్‌ బాబాయ్‌ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని తెలిపారు. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని, హత్య జరిగాక ఘటనాస్థలికి వెళ్లిన సీఐ సీబీఐకి విషయం తెలపడానికి సిద్ధపడ్డారని తెలిపారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చిందని గుర్తు చేశారు. హత్య కేసు విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంతన పాడే పరిస్థితి నెలకొందని, వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లి సీబీఐ సిబ్బంది తిరిగి వచ్చిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు.

Last Updated : Jul 23, 2024, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.