CM CBN Comments on Budget : కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకూ ఆమోదించారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని తెలిపారు.
రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కూరుకుపోయి ఉందన్న చంద్రబాబు, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా, దాదాపు 30ఏళ్ల తర్వాతే తీర్చేదన్న సీఎం, అది అప్పటికి అంత భారమేమీ కాదని అన్నారు.
వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందనీ, మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుందని తెలిపారు. వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా కాపిటల్ అసిస్టేన్స్ రూపేణా కలుస్తుందన్న ముఖ్యమంత్రి అది లాభమేనన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం చెప్పటం మనకి చాలు కదా అని వ్యాఖ్యానించారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని తమకు సమాచారముందన్న చంద్రబాబు.. ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఏపీ ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది - టీడీపీ ఎంపీల హర్షం - TDP MPs Response on Budget
పారిశ్రామిక రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇందులో నియమ నిబంధనలు పరిశీలించాక మనకు అనుకూలంగా వాటిని మల్చుకుంటామన్నారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చటం ప్రకాశం జిల్లాకు ఎంతో ఉపయోగమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరంద్రమోదీ సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందించారు. ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.
On behalf of the people of Andhra Pradesh, I thank the Hon'ble Prime Minister, @narendramodi Ji and Hon'ble Union Finance Minister, @nsitharaman Ji, for recognising the needs of our State and focusing on a Capital, Polavaram, industrial nodes and development of backward areas in… pic.twitter.com/ImgW3sor8d
— N Chandrababu Naidu (@ncbn) July 23, 2024
"అది కదా రహస్యం" - కేంద్ర నిధులు రాబట్టడంలో చంద్రబాబు చాణక్యం - AP SPECIAL FUNDS IN BUDGET 2024
యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అన్న మోదీ- కాపీ పేస్ట్ అంటూ రాహుల్ కౌంటర్ - union budget 2024