ETV Bharat / politics

'జగన్​ అరాచకాలకు అంతిమ ఘడియలు' - అంగన్​వాడీలకు మద్దతుగా విపక్షాలు - అంగన్వాడీల నిరసనలు

Chandrababu Naidu Respond on Anganwadis Protest : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరసన 42 వ రోజుకు చేరిన విషయం విధితమే. అయితే రాస్తారోకోలు, ధర్నాలు, వినూత్న యాత్రలతో సాగిన ఈ నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. వైఎస్సార్సీపీ నాయకులు తప్ప రాష్ట్రంలోని పలు పార్టీలు పలువురు నాయకులు అంగన్వాడీలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నిరసనలపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పవన్​కల్యాన్​ సహా నారా లోకేశ్ స్పందించారు.

anganwadis
opposition party leaders
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 4:14 PM IST

Updated : Jan 22, 2024, 5:04 PM IST

Chandrababu Naidu Respond on Anganwadis Protest : జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలు నెరవేర్చాలని రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన సహజసిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్దతులను అంగన్వాడీలపైనా ప్రయోగించడం నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. నిరసనలను అణచివేయడం, అనైతిక పద్దతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కంటే, ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చి ఉండేదని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం వ్యతిరేక చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి తన స్వలాభాలను పక్కన పెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

  • జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీల పై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణం. వైసీపీ ప్రభుత్వం తన సహజసిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్దతులను అంగన్వాడీలపైనా ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. నిరసనలను అణచివేయడం, అనైతిక పద్దతిలో సమ్మెను… pic.twitter.com/KYTseFinkG

    — N Chandrababu Naidu (@ncbn) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే జగన్​కు పట్టదా?: సీపీఐ శ్రీనివాసరావు

Lokesh On Anganwadis Strike : అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జగన్‌ నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు తాను వదిలిన బాణం తన వైపే దూసుకు రావడం మరోవైపు సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ ​ధ్వజమెత్తారు. అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తుండటంతో పిచ్చి పీక్ స్టేజికి చేరిందన్నారు. వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ఛలో విజయవాడకు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు చెలరేగుతున్నాయన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో ఫెన్సింగులు, వందలాది పోలీసులను దించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఉక్కు సంకల్పంతో చేస్తున్న ఆందోళనకు లోకేశఅ సంఘీభావం తెలిపారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని హితవు పలికారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

  • అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడి ప్రతాపం

    ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్…

    — Lokesh Nara (@naralokesh) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pawan kalyan On Anganwadis Protest : అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సామరస్యంగా చర్చించి సమస్య పరిష్కరించకుండావిధుల నుంచి తొలగించాలని ఆదేశాలివ్వడం, పోలీసు చర్యలకు దిగటంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రికి కోటి సంతకాలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ చేపడితే మహిళలను ఈడ్చి వేయడాన్ని ఖండించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ వర్తింప చేయాలనే అంగన్వాడీలు కోరుతున్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచన చేయాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

అక్రమ అరెస్టులపై కాదు - అంగన్వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి : చంద్రబాబు

Political Leaders respond on anganwadis protest : అంగన్వాడీలపై నిర్బంధానికి నిరసనగా వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన దీక్షలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య, సీపీఐ ఎం. ఎల్ నాయకులు హరికృష్ణ, వీరబాబు కూర్చున్నారు. అంగన్వాడీలతో చర్చలు జరిపి సామరస్యంగా వారి డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయకపోతే తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. 42 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే అంగన్వాడీ సమస్యలు జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి నుంచి మహిళలని చూడకుండా అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు.

అంగన్‌వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం - రేపట్నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలకు పిలుపు

Last Updated : Jan 22, 2024, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.