ETV Bharat / politics

ఏపీలో కూటమి సునామీ- 164 సీట్లతో విజయ దుందుభి - AP Election Result

AP Election Results: ఏపీలో కూటమి సునామీ సృష్టించింది. 164కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. ఊహించని పరాజయంతో ఫలితాల పట్టికలో వైఎస్సార్సీపీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ప్రాంతం అని తేడా లేకుండా కూటమి ఆడిన చెడుగుడుకు వైఎస్సార్సీపీ చతికిలపడింది.

ap assembly elections 2024
NDA win in ap assembly elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 9:04 AM IST

Updated : Jun 4, 2024, 10:55 PM IST

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 164కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. మూడుపార్టీలు మూకుమ్మడిగా ఫ్యాన్‌ రెక్కలు విరిగ్గొట్టి పక్కన పడేశాయి. సింహం సింగిల్‌గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్‌కు, ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు. పేదల ముసుగేసుకున్న పెత్తందారీ జగన్‌ను తరిమికొట్టారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఏకపక్ష విజయం నమోదైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది. వైనాట్ 175 అంటూ తలెగరేసిన వైఎస్సార్సీపీను సకలజనులూ నేలకేసికొట్టారు. ఉద్యోగులు ఉతికారేశారు..! టీచర్లు గుణపాఠం చెప్పారు. అంగన్వాడీలు బెత్తం ఎత్తారు. ల్యాండ్‌ టైటిలింగ్ చట్టంతో చెలగాటంఆడినందుకు రైతులు వైఎస్సార్సీపీ గుండెల్లో గునపాలు దించారు. ఉచిత ఇసుక తీసేసిన పాపానికి.. జగన్ ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మికులు కుప్పకూల్చారు. నిరుద్యోగులు నిలువునా పాతరేశారు. అక్కాచెల్లెళ్లు చీదరించుకున్నారు. అవ్వాతాతలు ఎగ్జిట్‌ బటన్‌ నొక్కేశారు. అధికార మదంతో మూసుకుపోయిన వైఎస్సార్సీపీ కళ్లు తెరిపించేలా 175 అసెంబ్లీ స్థానాలకుగాను కూటమి ఒక్కటే 164 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. పోటీచేసిన అన్ని స్థానాల్లో, జయభేరి మోగించిన పార్టీగా రికార్డ్‌ సృష్టించింది. వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. పది స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కూడా కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడం ఇదే తొలిసారి. ఇక అధికార వైఎస్సార్సీపీ కేవలం పది సీట్లకే పరిమితమై ..ఘోర ఓటమిని మూగట్టుకుంది. కలలోనైనా ఊహించని పరాజయంతో ఫలితాల పట్టికలో వైఎస్సార్సీపీ మూడో స్థానానికి పడిపోయింది. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 18 స్థానాలు కూడా గెలుచుకోలేక చతికలపడింది.

'ఆ విషయంలో నా లెక్క తప్పింది' - ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో - Venu Swamy on AP Election Results

సునామీ వస్తే ఊళ్లకు ఊళ్లు గల్లంతైనట్లే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అడ్రస్‌ కూడా గల్లంతైంది. జిల్లాలకు జిల్లాలను కూటమి..క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో..వైఎస్సార్సీపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి వైఎస్సార్సీపీను చావుదెబ్బ కొట్టింది. జగన్‌ సొంత జిల్లా కడపలో మాత్రమే మూడు స్థానాలు దక్కించుకుని.... వైఎస్సార్సీపీ కాస్త పరువు నిలుపుకోగలిగింది. పులివెందులలో జగన్‌ గెలిచినా, మెజార్టీ పడిపోయింది. 61 వేల 176 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జగన్‌.. 2019 ఎన్నికలతో పోల్చితే 28 వేల ఓట్ల మెజారిటీ కోల్పోయారు.

మూడుముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్‌ ముఠాను జనం మూడు ప్రాంతాల్లో ఛీకొట్టారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ తన కంచుకోటగా చెప్పుకున్న రాయలసీమ ప్రజలు కూడా జగన్‌ పార్టీ అభ్యర్థులను చీమల్లా నలిపేశారు. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలుండగా, కూటమి ఏకంగా 45 స్థానాలు కొల్లగొట్టింది. వైఎస్సార్సీపీముక్కీమూలిగీ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. అమరావతిని ఆగమాగం చేసిన జగన్‌ను రాజధాని ప్రాంత ఓటర్లు జీరో చేసేశారు. రాజధాని ప్రాంతంలోని 33కు 33 సీట్లనూ కూటమే గెలుచుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ జగన్‌ ముఠా ఖాతా తెరవలేదు. 34కి 34 స్థానాలూ కూటమే కొల్లగొట్టింది.! కార్యనిర్వాహక రాజధానిముసుగు వేసుకొచ్చిన జగన్‌ను.. ఉత్తరాంధ్ర ఈడ్చికొట్టింది. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు 32 కూటమి పార్టీలు గెలుచుకోగా, వైఎస్సార్సీపీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. సింహం, సింగిల్ అంటూ సినిమా డైలాగ్‌లు కొట్టిన జగన్‌కుకోస్తాంధ్ర ప్రాంతంలో ఒకే ఒక్క సీటు దక్కింది. కోస్తాంధ్రలో 22 సీట్లకు కూటమి 21 దక్కించుకుంది. ఇలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా కూటమి ఆడిన చెడుగుడుకు వైఎస్సార్సీపీ చతికిలపడింది.
ఐదేళ్లు అరాచక,అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పై ప్రజలు ఓటుతో వేటేశారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడారు. ఏ EVM తెరిచినా హలో ఏపీ.. బైబై వైసీపీ అనే తీర్పే కనిపించింది. కౌంటిగ్‌ ప్రారంభం నుంచే కూటమి ప్రభంజనం స్పష్టమైంది. ఏ దశలోనూ ఆ పార్టీ అభ్యర్థులు వెనుదిరిగి చూసుకోలేదు. రౌండ్‌ రౌండ్‌లో ఆధిక్యం పెంచుకుంటూ విజయతీరాలకు చేరుకున్నారు. పెద్దిరెడ్డి మినహా.. జగన్ మంత్రివర్గ సహచరులంతా మట్టికరిచారు. బొత్స, ధర్మాన వంటి సీనియర్‌ నేతలనూ ఓటర్లు ఇంటికి పంపారు. సామాజిక న్యాయం ముసుగులో జగన్‌ ఐదుగురు ఉపముఖ్యమంత్రులను జనంలోకి పంపినా ఎన్నికల బరిలో ఒక్కరూ కనీస పోటీ ఇవ్వలేక ఇంటికి పోయారు. శాఖలను పట్టించుకోకుండా, ప్రతిపక్షాలపై నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్న మంత్రుల జతకాలనూ ఓటర్ల మడతపెట్టేశారు.

ఎన్నికల ఫలితాలు ఊహించలేదు- ఆశ్చర్యం కలిగించాయి: వైఎస్ జగన్‌ - CM YS Jagan reacted to AP election results

Last Updated : Jun 4, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.