ETV Bharat / politics

బుడమేరు గండ్లు పూడ్చివేత - మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం - Budmeru Canal Gandi Works - BUDMERU CANAL GANDI WORKS

Budmeru Canal Gandi Works: క్షణం తీరిక లేకుండా ప్రభుత్వం పనిచేసి బుడమేరు గండ్లు పూడ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బడమేరుకు పడిన మూడవ గండి కూడా పూడ్చడంతో ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం లభించినట్లు అయ్యిందన్నారు. భారీ వరద ఉన్న సమయంలో అతిపెద్ద సవాల్​ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారంటూ మంత్రులు, అధికారులను చంద్రబాబు ప్రశంసించారు.

Budmeru Canal Gandi Works
Budmeru Canal Gandi Works (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 3:46 PM IST

Updated : Sep 7, 2024, 4:10 PM IST

CM CBN ON Budmeru Gandi Works Completion: బుడమేరు మూడవ గండి పుడ్చివేత పనులు పూర్తి అయ్యాయి. మూడవ గండి కూడా పూడ్చడంతో ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం లభించనట్లైంది. గండి పూడ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రులు, అధికారులు తీసుకువచ్చారు. భారీ వరద ఉన్న సమయంలో అతిపెద్ద సవాల్​ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

CM CBN High Level Teleconference: మరోవైపు 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూట కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టంచేశారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పని చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు గండ్లు పూడ్చివేయడంతో విజయవాడలోకి నీళ్లు రావని, భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.

రేపు సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు. బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోందని, పంపిణీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వరద ప్రభావం వల్ల 6వ డివిజన్​లో నిత్యవసర సరుకులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నారని, వారికి కూడా సరుకుల కిట్​ను అందించాలన్నారు. ఇళ్లల్లో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు, దీనికి అనుగుణంగా అధికారులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన సహాయం అందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్ తరువాత విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ముఖ్యమంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్రం రూ.3,300 కోట్లు సాయం ప్రకటిందన్న ప్రచారం అవాస్తవం - నేడు తొలి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Change in Vijayawada After Floods

Minister Nimmala Budameru: బుడమేరు కాలువ మూడు గండ్లను విజయవంతంగా పూడ్చివేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తంచేశారు. 6 రోజులుగా నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గండ్లను పూడ్చి వేశామని మంత్రి పేర్కొన్నారు. రెండో దశలో వరద నీరు పెరిగినా తట్టుకునేలా గట్లు ఎత్తు పెంచే పనులు చేపట్టామని మంత్రి వివరించారు. వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమేరు గట్లను బలోపేతం చేస్తున్నామన్నారు. వారం రోజులుగా పంటపొలాలు చెరువులను తలపించాయని, గండ్లు పూడ్చడంతో పంట పొలాలు బయట పడుతున్నాయని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం పూడ్చి వేసిన గట్లను మరింత బలోపేతం చేసే పని ప్రారంభించామన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు పడి ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్న మంత్రి, 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందన్నారు. గండ్లు పూడ్చి వేతతో
విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగిపోయిందన్నారు. ఇప్పుడు దిగువన జక్కంపూడి, సింగ్ నగర్ నిడమానూరు వరకూ నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టనున్నట్లు నిమ్మల స్పష్టంచేశారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నీరు వెళ్లిపోయేలా చర్యలు మొదలు పెట్టామన్నారు.

వరద బాధితులకు విరాళాల వెల్లువ- స్ఫూర్తిదాయకమని సీఎం అభినందనలు - Huge Donations To CMRF AP

Last Updated : Sep 7, 2024, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.