ETV Bharat / politics

వరద సాయంపై చర్చించేందుకు వైఎస్సార్​సీపీ నేతలు సిద్ధమా? : మంత్రులు - AP MINISTERS FIRE ON JAGAN

విజయవాడలో వరద సాయంపై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ మంత్రులు - పదేపదే దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక

ap_ministers_fire_on_jagan
ap_ministers_fire_on_jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 3:57 PM IST

AP Ministers Fire on Jagan about Flood Relief : వైఎస్సార్సీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌, నారాయణ విమర్శించారు. వరద సాయంపై అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సాక్షి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

Minister Narayana: తప్పుడు ప్రచారం చేసే జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యారని మంత్రి నారాయణ విమర్శించారు. రూ.602 కోట్లు పరిహరం ఇస్తే, రూ.5 వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయిలో తిరిగి ప్రజల మధ్యలోనే ఉన్నారని అన్నారు. కాని జగన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని మండిపడ్డారు. తాగు నీరుకే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాటర్ సప్లై చేశామని మంత్రి అన్నారు. జగన్ ఇలాగే మాట్లాడుతూ పోతే 11 సీట్లు కూడా పోయి సున్నానే మిగులుతుందని అన్నారు.

వరద సాయంపై చర్చించేందుకు వైఎస్సార్​సీపీ నేతలు సిద్ధమా? : మంత్రులు (ETV Bharat)

Home Minister Anita: వరద సాయంపై చర్చించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్​సీపీ నేతలు చర్చకు రావాలని హోంమంత్రి అనిత సవాల్‌ విసిరారు. ఎన్టీఆర్ జిల్లాలో టీఆర్ పద్దు కింద రూ.92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశామని అన్నారు. వరద సాయం కింద విడుదల చేసిందే రూ.139 కోట్లన్న మంత్రి అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్​ది అంతా ఫేక్ బతుకని 11 సీట్లు వచ్చేసరికి మతి పోయినట్టుందని విమర్శించారు. తాను చేసే అవినీతే అందరూ చేస్తారనే భ్రమలో జగన్ ఉన్నారని అన్నారు. రంగులకు, సర్వే రాళ్లకు, ఎగ్ పఫ్​ల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్లా తమ ప్రభుత్వం గురించి మాట్లాడేదని మంత్రి అనిత విమర్శించారు.

పునరావాసమా? అరణ్యవాసమా? - పోలవరం నిర్వాసితులకు జగన్​ శాపం - కూటమి ప్రభుత్వం కన్నీళ్లు తుడిచేనా!

Minister Anagani Satya Prasad: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్ట పరిహారం అందించామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ప్రకృతి విపత్తు సంభవించిన కొన్ని రోజుల్లోనే రూ.602 కోట్లు బాధితులకు పంచి పెట్టామని వెల్లడించారు. తోపుడు బళ్లకు ఆటోలకు కూడా నష్ట పరిహరం చెల్లించిన ప్రభుత్వాలు గతంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొన్న జగన్ సీఎం చంద్రబాబుపై బురద జల్లుతున్నారని మంత్రి అనగాని దుయ్యబట్టారు.

BC Welfare Minister Savitha: పారదర్శక పాలన చేస్తున్న సీఎం చంద్రబాబుపై జగన్ విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వరద బాధితులకు 139.75 కోట్లు ఖర్చు చేస్తే 500 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జగన్​ను, ఆయన ఫేక్ ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. ఇలాగే తప్పుడు ప్రచారాలు చేస్తే వైఎస్సార్​సీపీకి ఉన్న 11 సీట్లను కూడా ప్రజలు ఊడగొట్టడం ఖాయమని హెచ్చరించారు.

పండుగ వేళ పస్తులేనా? సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు

మద్యం టెండర్లకు మరో రెండు రోజులు - గడువు పెంచిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.