ETV Bharat / opinion

ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రభుత్వంపై ఫేక్​ వార్తలా ! - YSRCP Spreading Fake News - YSRCP SPREADING FAKE NEWS

Pratidwani: కనీసం ప్రతిపక్షహోదా కూడా లేకపోయినా టీడీపీ ప్రభుత్వంపై ప్రతిరోజూ బురద పూయటమే వైఎస్సార్సీపీ తంతుగా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వదులుతూ ప్రజల్లో అపోహాలు సృష్టించే పనిలో బిజీగా ఉంటుంది. ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఎందుకు పడిపోయామో పరిశీలన చేసుకుంటుందో? లేదో నిపుణులు అభిప్రాయాల ద్వారా తెలుసుకుందాం.

Pratidwani Debate on YSRCP Spreading Fake News
Pratidwani Debate on YSRCP Spreading Fake News (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 9:37 AM IST

Pratidwani : అశేషాంధ్రులూ వైఎస్సార్సీపీకి కనీసం ప్రతిపక్షహోదా కూడా లేని స్థితికి తెచ్చి కూటమికి అధికారం ఇచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ప్రతిరోజూ ప్రభుత్వానికి బురద పూయటం వైఎస్సార్సీపీ తంతు. దానిని కడుక్కోవటం చంద్రబాబు సర్కార్ వంతుగా మారింది. తన సొంత మీడియాలో, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వదులుతూ ప్రజల్లో అపోహాలు సృష్టించే ప్రయత్నంలో జగన్ పరివారం బిజీబిజీగా ఉంది. భూతాన్ని సిసాలో బంధించి, బిరడా బిగించి నేలలో పాతేసినట్టుగా ప్రజలు తీర్పిచ్చినా ఆ పార్టీ అభూత కల్పనలు ఆగట్లేదు. 2024 ఎన్నికల్లో నడ్డి విరగ్గొట్టే ఫలితాలు ఎందుకు వచ్చాయి? శిఖరాగ్రం నుంచి పాతాళానికి ఎందుకు పడిపోయాం? అనే ఆత్మ పరిశీలన వైఎస్సార్సీపీ చేసుకుంటోందా? ఈ అంశాల గురించి నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఉత్తరాంధ్రను వీడిన వైఎస్సార్సీపీ గ్రహణం- కూటమి రాకతో అభివృద్ధిపై ఆశలు - Pratidwani on Uttarandhra

ప్రజలు వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీని బండకేసి బాదినట్టుగా తీర్పు ఇచ్చారు. దాని నుంచి ఆ పార్టీ ఏవైనా గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను వేధించిన నాటి వైఎస్సార్సీపీ నాయకులను, అధికారులను చంద్రబాబు ప్రభుత్వం ఉపేక్షిస్తోందని గట్టి చర్యలు తీసుకోవట్లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జగన్ మాత్రం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నారు? గతంలో తమకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలను జగన్ ప్రశంసించి, ఇప్పుడు చిత్తుగా ఓడిపోతే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సెక్యూరిటీ మొత్తం తీసేశారని జగన్ కోర్టుకు వెళ్లటం, రాష్ట్ర ప్రభుత్వం మీద రోజుకో ఆరోపణలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి పట్ల తమ ప్రభుత్వం చట్ట పరంగానే వ్యవహరిస్తుంది తప్ప కక్షసాధింపులకు దిగదని చెబుతున్నారు. అయితే దానికి తగినట్టుగా టఫ్‌గా ఉండట్లేదు అనే ఆవేదన కూటమికి ఓటేసిన వారిలో కనిపిస్తోంది.

పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి? ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? - PRATIDWANI ON Grabbing Investments

జగన్ మీడియా, సోషల్ మీడియాలో ప్రతిరోజూ ప్రజల్లో సందేహం రేకెత్తించేలా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వదులుతూంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రం విడిపోయాకా 2014- 2019 మధ్య ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసినా కేవలం వైఎస్సార్సీపీ దుష్ప్రచారం వలన 2019లో ఓడిపోవాల్సి వచ్చింది. దాని కారణంగా టీడీపీకి కంటే ఎక్కువ నష్టం రాష్ట్రానికి జరిగింది. తప్పుడు ప్రచారాలను ఉపేక్షిస్తుంటే ఎటువంటి అనర్థాలు జరుగుతుంటాయి. అమరావతి, ప్రజా ఉద్యమాల మీద వైఎస్సార్సీపీ అనుకూల మీడియా సృష్టించిన అపోహలు గతంలో చూశాము. ప్రజా తీర్పు నుంచి వైఎస్సార్సీపీ గుణపాఠం నేర్చుకోలేక పోయినా గత అనుభవాల నుంచి ప్రభుత్వం అయినా ఏం లెసన్స్ నేర్చుకుంటే బాగుంటుందో నిపుణుల వివరణలో తెలుసుకుందాం.

రాజధానిలో జంగిల్​ క్లియరెన్స్​ - ఇకపై అమరావతి పురోగతి ఎలా ఉండబోతోంది? - Land Banking Role in Amaravati

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.