Prathidwani : 2019 ఎన్నికలకు ముందు రైతుల్ని ఆకట్టుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊరికో హామీ ఇచ్చారు. రైతులకు ఏటా 12 వేల 500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినదాని కంటే మిన్నగా ఏడాదికి 13 వేల 500 రూపాయలు ఇస్తున్నామంటూ ఇప్పుడు గొప్పలు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది కేవలం సంవత్సరానికి 7 వేల 500 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఇస్తున్న 6 వేల రూపాయలు కూడా కలిపి 13 వేల 500 ఇస్తున్నట్లుగా గొప్పలు చెబుతున్నారు. ఇది రైతుల్ని మోసం చేయడం కాదా?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇప్పటికే పలు సందర్భాలలో అధికార వైసీపీపై మండిపడ్డారు. వ్యవసాయరంగం, రైతుల్ని ఆదుకోవడంలో సీఎం జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడని దుయ్యబట్టారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు అనేక సార్లు విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ సర్కార్ విధానాలతో రాష్ట్ర అన్నదాతలు కోలుకోలేని విధంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. జగన్ మోసపూరిత ప్రకటనలతో గతంలో ప్రజలను నమ్మించారని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యానరంగానికి ఉరి తాడు: ఉద్యానరంగానికి సైతం జగన్ పాలన ఉరి తాడులా మారింది. పూలు, పండ్లు, కూరగాయల సాగుకు చీడలా పట్టింది వైసీపీ సర్కార్. రాయితీలకు కత్తెర వేసిన జగన్, ఉద్యాన రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఆదుకునే ఆపన్న హస్తం లేక ఉద్యాన రంగంలో సాగు విస్తీర్ణం అంతకంతకూ తగ్గిపోతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
సూక్ష్మ సేద్యానికి మోక్షం కలగడం లేదు: అదే విధంగా జగన్ పాలనలో సూక్ష్మ సేద్యానికి మోక్షం కలగడం లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రివర్స్ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ వెనక్కు తీసుకెళ్లిన జగన్, మొదటి మూడు సంవత్సరాల పాటు సూక్ష్మసేద్యాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతేడాది ఈ పథకాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేసినా ఆచరణ అంతంతమాత్రం గానే ఉంది.
జగన్ ఏలుబడిలో పన్నుల వాత, ధరల మోత- ఐదేళ్లుగా బాదుడే బాదుడు - Essential Commodities Prices
అసలు 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ రంగం ఎలా ఉండేది? 2019లో వైసీపీ వచ్చినప్పటి నుంచి అన్నదాతల పరిస్థితి ఏంటి? సాగునీటి కల్పనకు, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఏం చేసింది? బాధిత రైతులను పరిహారం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం ఆదుకుందా? ఇలా పలు విషయాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో వక్తలు చర్చించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియో కోసం పైన లింక్‌పై క్లిక్ చేసి చూడిండి.