ETV Bharat / opinion

జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు? - Debate on CM YS Jagan Promises

Prathidwani Debate on CM YS Jagan Promises: రాష్ట్రాభివృద్ధిపై కసి ఉందంటూ వివిధ సందర్భాల్లో ఆణిముత్యాల్లాంటి మాటలను వైఎస్ జగన్‌ చెప్పారు. అవినీతి అంతం, పేదరిక నిర్మూలన, మద్యపాన నిషేధం, పోలవరం పూర్తిపై కసి ఉందని ప్రతిపక్షంలో ఉండగా అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పూర్తి విరుద్ధంగా జగన్‌ వ్యవహారించారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Prathidwani_Debate_on_CM_YS_Jagan_Promises

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 11:47 AM IST

Prathidwani Debate on CM YS Jagan Promises: జగనన్నకు ఉన్న కసి ఏంటో తెలుసా? ప్రజల మీద కసి. ప్రగతి మీద, పరిశ్రమల మీద, రాజధానిపై కసి. దళితులు, బడుగులపై కసి. కోర్టులు, ఎన్నికల సంఘం, మీడియా వంటి వ్యవస్థలపై కసి. ప్రతిపక్షాలపైన, ఇచ్చిన హామీలపై, ప్రజావేదికపై, అన్న క్యాంటిన్లపై కసి ఉందని అని ప్రజలు భావిస్తున్నారు. కానీ జగనన్న మాత్రం తనకి వేరే కసి ఉందని ప్రతిపక్షనేతగా చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అధికారం చేతికి వచ్చాక ఆ కసి ఎవరి మీద తీర్చుకున్నారో తెలుసుకుందాం. ఇదే నేటి ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని చర్చలో దళిత బహుజన్‌ ఫ్రంట్ నుంచి కె.వినయ్‌కుమార్‌, న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నసమయంలో సీఎం జగన్ చాలా మాటలు చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకురావాలనే కసి తనలో ఉందని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని, రైతులకు వ్యవసాయం అంటే పండుగ అని చేసేందుకు కసి ఉందని అన్నారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు సంవత్సరాలలో మద్యపానాన్ని నిషేధిస్తానని పేర్కొన్నారు. వీటితో పాటు అవినీతి అంతం, పేదరిక నిర్మూలన, పోలవరం పూర్తి ఇలా చాలానే చెప్పారు.

కూటమి చేతిలో జగన్ ఓటమి ఖాయమా?- అందుకే ప్రలోభాల పర్వం ప్రారంభించారా?

ప్రతిపక్షంలో ఉండగా అనేక ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక పూర్తి విరుద్ధంగా జగన్‌ వ్యవహారించారు. అమరావతిని విధ్వసం చేశారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల నోటికాడ ముద్ద లాగేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు, బడుగులపై కసిగా దాడులు చేయించారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలపై దాడులు, కేసులతో రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. కోర్టులు, ఎన్నికల సంఘం, మీడియా వంటి వ్యవస్థలపై జగన్ తన ప్రతాపం చూపించారని మండిపడుతున్నారు.

ఇచ్చిన హామీల అమల్లో జగన్ ఏమాత్రం తన కసి చూపలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దోపిడీనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. నాడు మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పోల్చిన జగన్‌, ఐదేళ్ల కాలంలో మేనిఫెస్టో అమలును పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏ మాత్రం ప్రయత్నించలేదని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. మద్యపాన నిషేధం అని చెప్పి, ప్రభుత్వమే నేడు బిజినెస్ చేస్తోందని విమర్శించారు. నాసిరకం మద్యం కారణంగా అనేక మంది అనారోగ్యం పాలయ్యారని అన్నారు.

వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?

అదే విధంగా ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక రాష్ట్రాభివద్ధి, అవినీతి అంతంపై జగన్‌ ఎంతమేర కృషి చేశారు? పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనకు అధికారంలోకి వచ్చాక ఆయనేం చేశారు? పోలవరంపై ఐదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టాక చేనేతలకు చేసిందేంటి? వైసీపీ మేనిఫెస్టో అమలుపై జనం ఏమంటున్నారు? ఇలా అనేక విషయాలపై వక్తలు తమ అభిప్రాయాలు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని పైన లింక్​పై క్లిక్ చేసి చూడండి.

రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.