ETV Bharat / opinion

ప్రక్షాళన ఎలా??? కూటమి ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లేంటి? - Prathidhwani On New Government in Andhra Pradesh - PRATHIDHWANI ON NEW GOVERNMENT IN ANDHRA PRADESH

Prathidhwani On New Government in Andhra Pradesh : అపూర్వ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైంది. మరి కొత్తగా కొలువుదీరబోతున్న ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లేంటి? ఒక్కఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయి వాడి ఈ అయిదేళ్లల్లో ఏ ఏ శాఖల్లో ఏం చేశారు? ఆ పరిస్థితుల ప్రక్షాళన ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

prathidhwani_on_new_government_in_andhra_pradesh
prathidhwani_on_new_government_in_andhra_pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 10:49 AM IST

Prathidhwani On New Government in Andhra Pradesh : కనుచూపు మేర ఎటు చూసినా కూటమి ప్రభంజనమే సృష్టించింది ఆంధ్రనాట. అధికార వైఎస్సార్సీపీ అయిదేళ్ల అరాచకం, అహంకారాన్ని అథఃపాతాళానికి తొక్కేశారు ప్రజలు. మాకొద్దీ దిక్కుమాలిన ప్రభుత్వం అన్న ప్రజల విస్పష్ట తిరస్కారంతో 8 ఉమ్మడి జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు వైఎస్సార్సీపీ. మంత్రివర్గంలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా మట్టిగొట్టుకుని పోయారు. అపూర్వ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైంది. మరి కొత్తగా కొలువుదీరబోతున్న ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లేంటి? ఒక్కఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయి వాడి ఈ అయిదేళ్లల్లో ఏ ఏ శాఖల్లో ఏం చేశారు? ఆ పరిస్థితుల ప్రక్షాళన ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయనవేదిక కన్వీనర్‌ టి. లక్ష్మీ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్‌ ఏ. సురేష్‌.

ఐదేళ్ల అరాచక పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నెన్ని కుంభకోణాలు చేసిందో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందో లోతుల్లోకి వెళ్లి చూస్తేగానీ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వ కుంభకోణాలపై మీడియాకు, విపక్షాలకు తెలిసింది పైపైన మాత్రమేనని, అసలు విషయం లోతుల్లోకి వెళ్లి శోధిస్తేనే అర్థమవుతుందని అన్నారు. దీనికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగైదు రోజుల సమయం పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ రాక్షస పాలన అంతమవడంతో మీడియాకు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసిందన్నారు.

'ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేరుద్దాం'- కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలతో నారా లోకేశ్ - Lokesh Meeting with MLAs and MPs

‘30 ఏళ్లకు సరిపడా విధ్వంసం ఈ ఐదేళ్లలోనే జరిగింది. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు ఎంత చేశారో ఎక్కడెక్కడ చేశారో ఏయే పేర్లతో చేశారో లోతుల్లోకి వెళితే గానీ తెలియదు. సంబంధంలేని వ్యవస్థతో డబ్బులు తెచ్చి సంబంధంలేని మరో విభాగానికిచ్చారు. జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఇన్నాళ్లూ మీరు పత్రికల్లో రాసినవి మేం మాట్లాడిందీ చాలా తక్కువ. లోతుల్లోకి వెళితేనే వాళ్లు చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అసాధారణ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు బుధవారం తొలిసారి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో 'కింగ్ మేకర్ ఈజ్ బ్యాక్' - దిల్లీ రాజకీయాల్లో కీలకంగా చంద్రబాబు - lok sabha Kingmaker Chandrababu 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.