Prathidhwani on Increasing Drugs : సరదాగా కిక్ కోసమో, థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తుమందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయి. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత కెరీర్ సర్వనాశనం అవుతోంది. డ్రగ్స్ వ్యసనాల్ని వదులుకోలేని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. అయినా డ్రగ్స్ మాఫియా ఆగడాలు అంతం కావడం లేదు. అసలు పోలీసులు, నిఘా సంస్థల కళ్లుగప్పి గంజాయి, డ్రగ్స్ తయారీ ఎలా జరుగుతోంది? మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఏర్పడే మానసిక, శారీరక అనర్థాలు ఏంటి? చిన్నపిల్లలు, విద్యార్థులు, యవత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుమందుల సరఫరాను సమర్థంగా అడ్డుకోవడం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు మానసిక వ్యాధుల నిపుణుడు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డా. నవీన్‌కుమార్ దగుడు, ఆయుర్వేద వైద్యులు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ప్రొ.పి. రవీందర్‌గౌడ్.
Increased Drug Availability is Associated with increased Use and Overdose : జగన్ జమానాలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా మారిపోయింది. విదేశాల నుంచి కంటెయినర్లలో, టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు, నేరుగా రాష్ట్రంలోకి దిగుమతి అయిపోతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదకద్రవ్యాల్ని కలిపి ఇక్కడికి తెస్తున్నారు. వాటినిప్రాసెస్ చేసి మాదకద్రవ్యాల్ని వెలికితీసి మార్కెట్‌లోకి పంపుతున్నారు. రూ.లక్షల కోట్ల విలువైన ఈ వ్యవస్థీకృత అక్రమ దందా జగన్ జమానాలో ఉద్ధృతంగా సాగిపోతోంది. ఏపీలోకి సరకు తరలిస్తే, నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తమను పట్టించుకోవనే ధీమాతో స్మగ్లర్లు చెలరేగుతున్నారు.
మాదకద్రవ్యాల దిగుమతికి విశాఖ పోర్టును ఎంచుకోవడమూ, స్మగ్లర వ్యూహాత్మకమే అనిపిస్తోంది. విశాఖ పోర్టులో నౌకల్లోకి ఎక్కించే కంటెయినర్లలో కొన్నింటిని మాత్రమే ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. అనుమానం వస్తేనే, మొత్తం తనిఖీ చేస్తారు. స్కానింగ్ సైతం ఇటీవలే మొదలుపెట్టారు. అంతకుముందు అదీ లేదు. ఈ కారణాలతోనే, విశాఖ పోర్టును కొందరు అక్రమార్కులు ఎగుమతి, దిగుమతులకు ఎంచుకుంటున్నట్లు సమాచారం.