Pratidhwani On Paris Olympics 2024 : 2024 ఒలింపిక్స్‌లో 117మంది క్రీడాకారుల బృందంతో బరిలో దిగుతోంది భారత్. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరగనున్న ఈ క్రీడల్లో బాక్సింగ్, రెజ్లింగ్, జావెలిన్ త్రో, హాకీతోపాటు మొత్తం 16 విభాగాల్లో సత్తా చాటేందుకు క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. 70 మంది పురుషులు, 47 మంది మహిళా అథ్లెట్లున్న భారతబృందం అంతర్జాతీయంగా క్రీడా విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
గత ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారి కంటే ఈసారి క్రీడాకారుల సంఖ్య తగ్గినా సాధించే పతకాల సంఖ్య మాత్రం పెరుగుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో ఏఏ విభాగాల్లో గెలుపు అవకాశాలు బావున్నాయి? మన అథ్లెట్ల ప్రదర్శనలపై అంచనాలు ఎలా ఉన్నాయి? దేశంలో క్రీడాకారుల ప్రతిభను సానబెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలేంటి? అనే అంశాలపై చర్చించేందుకు నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.పి రావు, ఇండియన్ హ్యాండ్ బాల్ టీం కోచ్ డా.ఎం రవికుమార్ పాల్కొన్నారు.
ఒలింపిక్స్ గ్రామంలో స్పెషల్ అరేంజ్మెంట్స్ - అథ్లెట్ల కోసం 3 డ్రెస్ కిట్స్ - Paris Olympics 2024
ఒలింపిక్స్ 2024లో పాల్గొనబోతున్న భారత క్రీడా బృందాలపై చాలా అంచనాలున్నాయి. మొత్తం కంటింజెంట్‌పై దేశం పెట్టుకున్న ఆకాంక్షలు ఏమిటి? బాక్సింగ్, రెజ్లింగ్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లో మన అథ్లెట్లు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ఇలా ఇంకా ఏఏ విభాగాల్లో టైటిల్‌పై ఆశలున్నాయి? ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగురాష్ట్రాల నుంచి ఏఏ క్రీడల్లో తెలుగువారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? వారిలో ఆశాకిరణాలుగా ఉన్న వారు ఎవరు?
అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున ఆడుతున్న్పపుడు క్రీడాకారుల భావోద్వేగాలు ఎలా ఉంటాయి? పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో రాణించాలంటే క్రీడాకారులకు ఏఏ అంశాల్లో మద్ధతు అవసరం? కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రీడా విధానాలు ఎలా ఉన్నాయి? మన క్రీడాకారులు మరింత మంది అంతర్జాతీయస్థాయిలో రాణించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? క్రీడాకారుల మెరుగైన శిక్షణకు అవసరమైన మైదానాలు, క్రీడా ప్రాంగణాలు, అకాడమీల వంటి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాల ప్రాధాన్యత ఎలా ఉంది? మెరుగుపర్చుకోవాల్సిన అంశాలేంటి?
ఒలింపిక్స్ వల్ల ఆతిథ్య దేశాలకు లాభమా? నష్టమా? - Paris Olympics 2024
క్రీడల అభివృద్ధిలో క్రీడాసంఘాలు, అసోసియేషన్లు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి స్పాన్సర్లను సమకూర్చడంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి? ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో క్రీడల అభివృల పట్ల సానుకూల వైఖరి కలిగిన ప్రభుత్వాలున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులైన శిక్షకులు, క్రీడాసేవల విషయంలో దృష్టి సారించాల్సిన అంశాలు ఏమున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.