ETV Bharat / offbeat

ధర్మవరం యువకుల ప్రతిభ - 'సేద్యం' చిత్రానికి 6 అంతర్జాతీయ పురస్కారాలు - AWARD TO SEDYAM MOVIE - AWARD TO SEDYAM MOVIE

Dharmavaram Youth Sedyam Movie got Prestigious International Film Festival Award: అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రకృతి విలయాలు కాటేసినా దళారులు నిలువు దోపిడీ చేస్తున్నా నేల తల్లిని వదులుకునేందుకు ఇష్టపడడు రైతన్న. కష్టాలు, బాధలు సహిస్తూనే మన ఆకలి తీరుస్తాడు. ఈ నేపథ్యంతోనే మనసుకు హత్తుకునేలా ఓ సినిమా చిత్రీకరించారు ఇద్దరు మిత్రులు. కర్షకుల జీవితాలు కళ్లకు కట్టినట్టి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవార్డు సాధించిన 'సేద్యం' చిత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

sedyam_movie_made_by_anantapur_youth
sedyam_movie_made_by_anantapur_youth (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 5:58 PM IST

International Film Award to Sedyam Movie Made by Dharmavaram Youth: చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరి ఆలోచన ఒక్కటే. సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటాలి. ఒకరు దర్శకత్వం వైపు అడుగులేస్తే మరొకరు సినిమాటోగ్రఫీలో అనుభవం సంపాదించారు. లఘుచిత్రాలతో సినీ ప్రయాణం మొదలుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రత్యక్ష అనుభవాలతో 'సేద్యం' చిత్రం రూపొందించి 6 అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చంద్రకాంత్‌, విష్ణువర్ధన్‌రెడ్డిలు చిన్ననాటి నుంచే స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరూ కలిసి తరచూ సినిమాల గురించే మాట్లాడుకునేవారు. పెద్దయ్యాక ఆసక్తి మరింత పెరిగింది. సీఏ చదువు ఆపేసి మరీ దర్శకత్వం పైన దృష్టి పెట్టాడు చంద్రకాంత్‌. విష్ణువర్దన్ రెడ్డి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఫిల్మ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో చేరాడు. ఇద్దరూ ఏడాదిలోపే తాము ఎంచుకున్న రంగాల్లో పట్టు సాధించారు.

2016లో తొలిసారి 'నా ఊపిరి' అనే లఘు చిత్రం రూపొందించారు ఈ స్నేహితులు. ఇప్పటి వరకు 11 షార్ట్‌ఫిల్మ్‌లు, పూర్తిస్థాయిలో 'సేద్యం' సినిమా చిత్రీకరించారు. ఉద్యోగం, మంచి జీతం కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే వారు పడే అగచాట్లపై వీరు తీసిన 'గల్ఫ్‌గోస'కు అనేక అంతర్జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చాయని చెబుతున్నాడు చంద్రకాంత్‌.

'ఇంటర్​ అయిపోయినప్పటి నుంచి కెరీర్​ ప్రారంభించాను. ఫిల్మ్​ మేకింగ్​ చేస్తూనే డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశాను. మా నాన్న చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూపించేవారు. అప్పటి నుంచే నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకున్నా, వయసు పెరుగుతుంటే ఆసక్తి పెరిగింది. షార్ట్​పిల్మ్​లు చేశాను. సామాజిక సమస్యలు సహా కమర్షియల్​ సినిమాలు తీశాను. వివిధ వేదికలపై నా సినిమాలకు అవార్డులు రావడం నాకెెంతో స్ఫూర్తినిస్తాయి.' -పసుపులేటి చంద్రకాంత్, సేద్యం దర్శకుడు

లాక్‌డౌన్‌ సమయంలో రైతులు ఆత్మహత్యలకు కారణాలపై ఓ సారి చర్చించుకున్నారు ఈ ఇద్దరు మిత్రులు. ఈ అంశంపై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. మైసూర్‌లో కుమార స్వామి అనే వ్యక్తి 5 అంచెల పంటల విధానంతో చిన్నకమతంలోనే అధిక ఆదాయం పొందుతున్నాడని తెలుసుకున్నారు. ఆయన్ని కలిసి కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నారు. తాము నేర్చుకున్న విషయాలను ఎకరా పొలంలో ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టి విజయం సాధించారు చంద్రకాంత్‌, విష్ణులు. ఈ అంశాన్నే సేద్యం క్లైమాక్స్‌లో వివరించామని అంటున్నారు.

రోడ్డుపైనే సాధన - విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట - Extensive Skills in Roller Skating

ఇండో ఫ్రెంచ్ ఫెస్టివల్​లో సేద్యం సినిమా ప్రదర్శించి విజేతలుగా నిలిచామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు, ఆర్థిక వనరులు లేకున్నా సమాజాన్ని చైతన్యపరిచేలా సేద్యం చిత్రం రూపొందించారని అంటున్నారు చంద్రకాంత్‌ తండ్రి. అంతర్జాతీయ పురస్కారం సాధించిన ఈ చిత్రంలో తానూ నటించడం గర్వంగా ఉందని చెబుతున్నారాయన. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోనే సేద్యం సినిమా మంచి వ్యూస్‌తో దూసుకు పోతోంది. ఈ ప్రయత్నానికి అంతర్జాతీయ వేదికలపైనా ప్రశంసలు దక్కడంతో మరింత బాధ్యతతో సినిమాలు రూపొందిస్తామని అంటున్నారు ఈ ఇద్దరు మిత్రులు.

పేరుకు తగ్గట్లుగానే 'చరిష్మా' - ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​​ లక్ష్యమంటున్న విజయవాడ యువతి - Vijayawada Surya Charisma

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.