Hidden cameras: అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంత మేలు చేస్తుందో అది నిరుపయోగం అయితే అంతే ప్రమాదం కూడా. ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల అంశం వెలుగు చూసిన తర్వాత ప్రతిఒక్కరిలోనూ దీనిపై ఆందోళన నెలకొంది. గోప్యతకు ముప్పుగా మారింది. అయితే రహస్య కెమెరాలు ఎక్కువగా గోడ గడియారాలు, పవర్ బ్యాంక్‌లు, పిక్చర్ ఫ్రేమ్, అలంకరణ వస్తువులలో అమర్చుతున్నారు. ఈ రహస్య కెమెరాలను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది.
ఐదుగురు అల్లిన 'ప్రేమ'కథా చిత్రమ్
find out Hidden cameras: ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు రహస్య కెమెరాలు లభిస్తుండటం వ్యక్తుల గోప్యత అనేది తీవ్రమైన ప్రమాదంలో పడింది. అయితే మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతమున్న టెక్నాలజీని ఉపయోగించి.. ఇలాంటి రహస్య కెమెరాను చాలా సులువుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా RF డిటెక్టర్లు, కెమెరా లెన్స్ డిటెక్టర్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, Wi-Fi స్కానర్ల సహాయంతో రహస్య కెమెరాలను పసిగట్టొచ్చు. అంతే కాదు నేరుగా మన కళ్లతో చూసి కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రహస్య కెమెరాలు చట్టవిరుద్ధమా: రహస్య కెమెరాల కొనుగోలు పూర్తిగా చట్టబద్ధమే అయినప్పటికీ, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంట్లో, పరిసరాల్లో హిడెన్ కెమెరాలను అమర్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇంటిని మరొకరికి అద్దెకు ఇచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు.. వారికి తెలియకుండా రహస్య కెమెరాలను అమర్చడం నేరం అవుతుంది. అలాగే ప్రభుత్వ సంస్థల వద్ద, రక్షణ ప్రాంతాల్లో మన వ్యక్తిగత రహస్య కెమెరాలు అమర్చడం చట్టవిరుద్ధమవుతుంది.
రహస్య కెమెరాలను గుర్తించడం ఎలా?
1. నేరుగా కళ్లతో చూడడం: మనకు అనుమానం ఉన్న ప్రాంతంలో నిశితంగా గమనించాలి. గోడ గడియారాలు, పూల కుండీలు లాంటి పెద్ద ఆకృతిలో ఉండే వస్తువుల్లో అమర్చే కెమెరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే గుర్తు పట్టేయొచ్చు. ఒక వేళ కంటికి కనిపించకపోతే, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ స్పై కెమెరాలను గుర్తించవచ్చు
2. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు: కంటికి కనిపించని కెమెరాలను గుర్తించడానికి RF డిటెక్టర్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాల నుంచి తరచుగా వెలువడే రేడియో తరంగాలను గ్రహించడం ద్వారా RF టిటెక్టర్ వాటిని గుర్తిస్తుంది. చాలా కెమెరాలు 500MHz నుంచి 6GHz వరకు రేడియో తరంగాలను ప్రసారం చేస్తాయి. స్కాన్ చేయడం ద్వారా డిటెక్టర్లు ఈ హిడెన్ కెమెరాలను పసిగడతాయి.
3. కెమెరా లెన్స్ డిటెక్టర్లు: కొన్ని రహస్య కెమెరాలు తమ ఫీడ్‌ను SD కార్డ్స్ లాంటి లోకల్ స్టోరేజ్‌ల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ పరికరాలకు రేడియో సిగ్నల్స్ అవసరం లేదు. అయితే ఇలాంటి కెమెరాలను కూడా కెమెరా లెన్స్ డిటెక్టర్లతో గుర్తించవచ్చు. కెమెరా లెన్స్ సాధారణంగా కాంతి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తుంటాయి. ఇలా చేస్తున్న సమయంలో సెన్సార్ ఆఫ్ అయినట్లయితే, సదరు ప్రాంతంలో రహస్య కెమెరాలు ఉన్నాయని అనుమానించవచ్చు. అప్పుడు నేరుగా సదరు ప్రాంతంలో చెక్ చేసి, రహస్య కెమెరాలు ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. అంతే సింపుల్
4. థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు: సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటే.. అవి వేడెక్కుతాయి. కనుక థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి, రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఉదాహరణకు ల్యాప్‌టాప్‌లను, ఫోన్లను ఎక్కువసేపు ఉపయోగిస్తే వేడెక్కుతాయి. అందువల్ల థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఉపయోగించి రహస్య కెమెరాల "గుట్టు రట్టు" చేయవచ్చు.
5. స్మార్ట్ ఫోన్: రహస్య కెమెరాలను కనుగొనేందుకు స్మార్ట్‌ఫోన్లు చక్కగా ఉపయోగపడతాయి. రకరకాల యాప్‌ల సహాయంతో రహస్య కెమెరాలను గుర్తించొచ్చు. చీకటిలో రికార్డ్ చేయడానికి కెమెరా లెన్స్‌లకు కొంత ప్రకాశవంతమైన ఫీచర్లు అవసరం. చాలా మంది తయారీదారులు ఇన్‌ఫ్రారెడ్ (IR) సాంకేతికత వాడుతుంటారు. ఇది కంటికి కనిపించదు. కనుక మీరు మీ ఫోన్లోని ఫ్రంట్ కెమెరాను ఆన్‌చేసి, చీకటిలో మీ గది మొత్తాన్ని చూడండి. సాధారణ కంటికి కనిపించని, ఏదైనా వెలుగు ఫోన్ కెమెరాలో కనిపిస్తే వెంటనే అది హిడెన్ కెమెరా అని గుర్తించండి.
6. Wi-Fi స్కానర్
మన స్మార్ట్ ఫోన్ ద్వారా వై-ఫై నెట్‌వర్క్‌లను సులువుగా గుర్తించవచ్చు. కనుక దీని ద్వారా మీ ఇంట్లో వై-ఫైతో రన్ అవుతున్న రహస్య కెమెరాలను సులువుగా గుర్తించవచ్చు. అంతేకాదు హ్యాండ్‌హెల్డ్ Wi-Fi, నెట్‌వర్క్ స్కానర్‌ల ద్వారా కూడా రహస్య కెమెరాలను గుర్తించొచ్చు.
స్పై కెమెరాలు ఉన్నాయని అనుమానంగా ఉందా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండిలా!