ETV Bharat / international

ఒలింపిక్స్​ ముందు భారీ కుట్ర- ఫ్రాన్స్​లో రైల్ నెట్​వర్క్​ కట్- ఇది రష్యా ప్లానేనా? - France Train Traffic

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 5:33 PM IST

France Train Traffic: పారిస్‌ ఒలింపిక్స్‌కు ముప్పేటలా ముప్పు పొంచి ఉందని మొదటి నుంచి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా అవి నిజమనిపించేలా ఫ్రాన్స్‌ హైస్పీడ్‌ రైళ్ల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు దాడి చేశారు. కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా పట్టాలకు నిప్పు పెట్టగా మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడంతో పాటు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో సెన్‌ నదిలో జరగనున్న ప్రారంభ వేడుకల విషయంలో ఆందోళన మొదలైంది. ఇది పూర్తిగా నదిలో జరుగుతుండటంతో యాంటీ టెర్రర్‌ పోలీసులను నదీ తీరంలో మోహరించారు.

France Train Traffic
France Train Traffic (Source: Associated Press)

France Train Traffic: ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్‌లో గందరగోళం నెలకొంది. ఫ్రాన్స్‌ హైస్పీడ్‌ రైల్వే నెట్‌వర్క్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొన్నిచోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేయగా మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడం, నిప్పు పెట్టడం చేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పారిస్‌కు రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఐరోపా నుంచి పారిస్‌కు సైతం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు ఒలింపిక్స్‌ క్రీడలకు తాజా దాడులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.

రైల్వే పట్టాలకు నిప్పు పెట్టి తప్పించుకుంటుండగా దుండగులను కొందరు స్థానికులు చూశారని ఫ్రాన్స్‌ రవాణా శాఖ మంత్రి తెలిపారు. రైల్వే పట్టాల వద్ద నిప్పును రాజేసే పరికరాలను గుర్తించినట్లు చెప్పారు. పశ్చిమ, తూర్పు, ఉత్తర ప్రాంతాల రైల్వే సేవలకు ఆటంకం కలిగిందని ఫ్రాన్స్‌ రైల్వే కంపెనీ SNCF తెలిపింది. రైళ్ల పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. రైల్వే పట్టాలపై మరమ్మతు పనులు చేపట్టామని పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. టికెట్‌ డబ్బులను చెల్లిస్తామని వెల్లడించింది.

మే నెలలో ఫ్రాన్స్‌ పోలీసులు ఓ చెచెన్‌ జాతీయుడిని అరెస్టు చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో సాకర్‌ గేమ్‌ సందర్భంగా ప్రేక్షకులు, భద్రతా దళాలపై ఆత్మహుతి దాడి చేయాలని అతడు ప్లాన్‌ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నెలలో ఛాంపియన్స్‌ లీగ్‌పై డ్రోన్‌తో దాడి చేస్తామని ఐసీఎస్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రసంస్థ ఒలింపిక్స్‌ను టార్గెట్‌ చేసుకొనే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. గత తొమ్మిది నెలల్లో ఐరోపాలో ఐసిస్‌ సంబంధిత అరెస్టుల్లో మూడింట రెండొంతులు టీనేజర్లు ఉన్నారు. ముఖ్యంగా ఆ ఉగ్ర సంస్థ ఖోరసాన్‌ విభాగం తుర్కియోలో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొంది. ఆ దేశ ఎంఐటీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ లెక్కల ప్రకారం 2023లో 426 ఐసిస్‌-కె అనుమానితులను అరెస్టు చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా- ఐరోపా దేశాల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను భగ్నం చేయడానికి మాస్కో కుట్ర పన్నినట్లు అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ క్రీడల నుంచి రష్యా, బెలారస్‌లను తప్పించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఒలింపిక్స్‌లో గందరగోళానికి యత్నిస్తున్నాడనే ఆరోపణలతో ఓ రష్యా జాతీయుడిని ఇటీవల అరెస్టు చేశారు. కొన్నాళ్ల క్రితం జర్మనీ సైనిక లక్ష్యాలపై దాడికి, యూకే, లిథువేనియాల్లో దాడులకు, జర్మనీ రక్షణ కాంట్రాక్టర్‌ రైన్మెటాల్‌ సీఈవో హత్యకు కుట్ర పన్నినట్లు మాస్కోపై ఆరోపణలు వచ్చాయి. గత నెలలో పారిస్‌లోని చార్లెస్‌ డిగాల్‌ ఎయిర్‌పోర్టు వద్ద పేలుడులో రష్యా- ఉక్రెయిన్‌ జాతీయుడి హస్తం ఉండటం ఫ్రాన్స్‌లో భయాలు పెంచాయి.

ఐసిస్‌, రష్యా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఒలింపిక్స్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సెన్‌ నదిపై జరగనున్న ఆరంభ వేడుకలను కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం దాదాపు 45 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని ఈ వేడుకల రక్షణకు వినియోగించేందుకు సిద్ధమైంది. వీరిలో 18 వేల మంది సైన్యానికి చెందినవారు ఉండగా మరో 35 వేల మంది జెండర్మీస్‌ అనే పారామిలటరీ దళానికి చెందిన వారు ఉన్నారు. అత్యవసరమైతే నిమిషాల్లో సంక్షోభ ప్రదేశానికి చేరుకొనేలా 24 గంటలూ నాలుగు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు. ప్రారంభోత్సవ వేళ నగర పరిధిలోని 150 కిలోమీటర్లను నోఫ్లై జోన్‌గా ప్రకటించారు.

పారిస్ ఒలింపిక్స్​కు ఏఐ నిఘా - ప్రైవసీపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు - Paris Olympics 2024

ఒలింపిక్స్​కు హై సెక్యూరిటీ- పారిస్​లో ఇండియన్​ డాగ్ స్వ్కాడ్- డ్యూటీలో 45వేల మంది పోలీసులు! - 2024 Paris Olympics

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.