Toppers Inspiring Stories: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి పూర్తి అయ్యింది. ఈ ఫలితాల్లో విద్యార్ధులు సాధించిన ప్రతిభ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. మన రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల్లానే పక్కనే ఉన్న కర్నాటకలోనూ SSLC పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఓ చిన్నారి సాధించిన మార్కులు అందరికీ ఆశ్చరమేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 599/600 మార్కులతో ప్రశంసలు అందుకోగా.. తాజాగా కర్ణాటకలో ఓ అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించి అదరహో అనిపించింది.
599/600 - టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ
కర్నాటకలోని కొన్నూరు బాగల్‌కోట్ జిల్లా, ముధోల్ తాలూకా మెల్లిగేరి గ్రామంలో మొరార్జీ దేశాయ్ పాఠశాలకు చెందిన అంకిత బసప్ప 625 మార్కులకు 625 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానం రావడం పట్ల అందకిత సంతోషం వ్యక్తం చేసింది. పైగా నాకు వచ్చిన మార్కుల పట్ల నాకంటే నా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. " పీయూసీలో సైన్స్ విభాగం చదివి ఐఏఎస్ కావాలన్నది నా కల, నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు రెండవ తరగతి, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు." అని అంకిత చెప్పారు. తండ్రి బసప్ప రైతు కాగా.. తల్లి గృహిణి.
599/600 - టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ
ఇక 625మార్కులకు 625 సాధించి అంకిత మొదటి స్థానంలో నిలిస్తే.. ద్వితీయ స్థానం కూడా విద్యార్ధులు అదే స్థాయిలో పోటీ పడ్డారు. మేథా, హిర్షిత, చిన్మయ్, శ్రీరాములు అనే విద్యార్ధులు 624 మార్కులు సాధించారు. ఇలా విద్యార్ధులు తమ ప్రతిభను చాటి మొదటి స్థానంతో సమానంగా సెకండ్ ర్యాంకు సాధించారు.
ఏపీ టెన్త్ ఫలితాల్లో మన నాగసాయి మనస్వీ టాప్: 600మార్కులకు గాను 599 మార్కులు సాధించింది. ఆరు సబ్జెక్టుల్లో 100, 99, 100, 100, 100, 100 మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి (Venkata Naga Sai Manasvi) ఈ మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో మనస్వీ100కు వంద మార్కులు పొందింది. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనస్వీ చదివింది. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనస్వీ పేర్కొంది.