ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 9:31 AM IST

Updated : Apr 26, 2024, 10:16 AM IST

Gold Price Today April 26, 2024
Gold Rate Today April 26, 2024

Gold Rate Today April 26, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 26, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,379 ఉండగా, శుక్రవారం నాటికి రూ.72 పెరిగి రూ.74,451కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.83,638 ఉండగా, శుక్రవారం నాటికి రూ.11 పెరిగి రూ.83,649కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 26, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,451గా ఉంది. కిలో వెండి ధర రూ.83,649గా ఉంది.
  • Gold Price In Vijayawada April 26, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,451గా ఉంది. కిలో వెండి ధర రూ.83,649గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 26, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,451గా ఉంది. కిలో వెండి ధర రూ.83,649గా ఉంది.
  • Gold Price In Proddatur April 26, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,451గా ఉంది. కిలో వెండి ధర రూ.83,649గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,327 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2333 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.47 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 26, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.53,59,644
ఇథీరియం రూ.2,54,103
టెథర్రూ.80
బైనాన్స్ కాయిన్రూ.47,000
సొలోనారూ.11,968

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 26, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై, తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 165 పాయింట్లు నష్టపోయి 74,183 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 34 పాయింట్లు కోల్పోయి 22,535 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టెక్ మహీంద్రా, టాటాస్టీల్​, విప్రో, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​సీఎల్ టెక్​, ఐటీసీ, టాటా మోటార్స్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​బజాజ్​ ఫైనాన్స్​, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open April 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.33గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 26, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.33 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 89.30 డాలర్లుగా ఉంది.

ఆన్​లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips

కోటక్​ బ్యాంక్​కు RBI షాక్​ - కొత్త అకౌంట్లు, క్రెడిట్​ కార్డ్​లపై బ్యాన్​! - RBI Bars Kotak Mahindra Bank

Last Updated :Apr 26, 2024, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.