ETV Bharat / business

గుడ్ న్యూస్ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 9:23 AM IST

Updated : Apr 22, 2024, 10:11 AM IST

Gold Price Today April 22nd 2024
Gold Rate Today April 22nd 2024

Gold Rate Today March April 22nd 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 22nd 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.76,141 ఉండగా, సోమవారం నాటికి రూ.619 తగ్గి రూ.75,522కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.85,860 ఉండగా, సోమవారం నాటికి రూ.907 తగ్గి రూ.84,953కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 22nd 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
  • Gold Price In Vijayawada April 22nd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 22nd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
  • Gold Price In Proddatur April 22nd 2024: ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,392 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 20 డాలర్లు తగ్గి 2,370 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.02 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 22nd 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.51,62,348
ఇథీరియం రూ.2,49,071
టెథర్రూ.80.61
బైనాన్స్ కాయిన్రూ.45,172
సొలోనారూ.11,312

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 22nd 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరగడం సహా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 214 పాయింట్లు లాభపడి 73,302 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 76 పాయింట్లు వృద్ధి చెంది 22,223 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఆల్ట్రాటెక్ సిమెంట్​, యాక్సిస్ బ్యాంక్​, ఎల్​ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్​, హెచ్​సీఎల్ టెక్​, కోటక్ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్, రిలయన్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఎం అండ్ ఎం

రూపాయి విలువ
Rupee Open March April 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 22nd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.74 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 86.64 డాలర్లుగా ఉంది.

జీవిత బీమా తీసుకున్నారా? పరిహారం ఇవ్వకపోతే ఏం చేయాలో తెలుసా? - Life Insurance Claim Settlement

ఐసీఐసీఐ బ్యాంక్​ కస్టమర్లకు అలర్ట్​ - భారీగా సర్వీస్ ఛార్జీలు పెంపు - మే 1 నుంచే అమలు! - Revised ICICI Bank Service Charges

Last Updated :Apr 22, 2024, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.