ETV Bharat / bharat

పార్టీ జెండా ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్​- ఆ రెండు ఏనుగుల అర్థం అదేనా? - Tamilaga Vettri Kazhagam Flag

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 10:00 AM IST

Updated : Aug 22, 2024, 10:54 AM IST

Tamilaga Vettri Kazhagam Flag : సినీ నటుడు విజయ్ చెన్నైలో 'తమిళగ వెట్రి కళగం' పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Tamilaga Vettri Kazhagam Flag
Tamilaga Vettri Kazhagam Flag (ETV Bharat)

Tamilaga Vettri Kazhagam Flag : తమిళనాడు చెన్నైలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ కార్యాలయంలో నటుడు, పార్టీ అధినేత విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్టీని ప్రకటించిన విజయ్‌, తాజాగా చెన్నైలో తాజాగా పార్టీ జెండా, గుర్తు ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి.
జెండాలో పైనా, కింద ఎరుపు రంగు, మధ్యలో పసుపు రంగు ఉంది. జెండా మధ్యలో "వాగై" పువ్వు ఉంది. ఇరువైపులా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా రెండు ఏనుగులు ఉన్నాయి. వాగై పువ్వుల దండను సంగం రాజుల కాలంలో విజయానికి గుర్తుగా ధరించేవారు.

పార్టీ జెండాతో పాటు టీవీకే (Tamizhaga Vetri Kazhagam) గీతాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి విజయ్‌ ప్రతిజ్ఞ చేశారు. "మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం" అని విజయ్‌ ప్రతినబూనారు. వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో విజయ్ పార్టీ పెట్టడం కీలకంగా మారింది.

ఇకపై సినిమాలు చేయబోడా?
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే స్పష్టంచేశారు. ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా పార్టీ జెండా, అజెండాను ఆవిష్కరించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా? లేదా పొత్తులకు ముందుకొస్తారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. కాగా విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గోట్ (GOAT) సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా తర్వాత తాను సినిమాలు చేయనని, సినిమాల నుంచి తప్పుకుంటానని విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దళపతి విజయ్ సీరియస్ పొలికల్ కామెంట్స్​ - దిల్లీపైనే గురి! - Vijay Speaks Against NEET Exam

'ఒక్క ఓటు' విలువ - విజయ్​​ దళపతి ఎంత గొప్పగా చెప్పారో చూడండి! - Vijay Thalapahy Vote Value

Last Updated : Aug 22, 2024, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.