ETV Bharat / bharat

'కుటుంబీకులు మరణిస్తే ఇల్లు కూల్చివేత- వేరే ప్రాంతానికి వలస'- ఈ వింత ఆచారం ఎక్కడంటే! - pahadi korwa tribal culture

author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 12:41 PM IST

Pahadi Korwa Tribe Unique Tradition : తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఏకంగా ఇల్లును కూల్చేస్తున్నారు ఛత్తీస్​గఢ్​కు చెందిన గిరిజనులు. అలాగే ఆ ఇంటిని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోతున్నారు. అక్కడ ఇల్లును కట్టుకుని జీవిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఛత్తీస్​గఢ్ గిరిజనుల్లో ఉన్న ఈ ఆచారం గురించి తెలుసుకుందాం.

Pahadi Korwa Tribe Unique Tradition
Pahadi Korwa Tribe Unique Tradition (Etv Bharat)

Pahadi Korwa Tribe Unique Tradition : ఛత్తీస్​గఢ్​లో ఓ గిరిజన తెగ తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇల్లును వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వేరే ప్రాంతానికి వలస వెళ్లి మరో చిన్న ఇల్లుని నిర్మించుకుని జీవిస్తున్నారు. ఇక్కడ ఉంటే మరణించిన తమ కుటుంబ సభ్యులు దెయ్యాలుగా కనిపిస్తున్నారని, వారి జ్ఞాపకాలు తమను వదలడం లేదని అందుకే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వింత ఆచారం ఏంటో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందామా మరి.

కోర్భాలోని పహాడా కోర్వా గిరిజనుల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ గిరిజనుల్లో చాలా మంది ఇప్పటికీ అడవిలో సంచార జీవితాన్ని గడుపుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆ విషాదం నుంచి బయటపడేందుకు ఇల్లును కూల్చేస్తామని గిరిజనులు చెబుతున్నారు. అజ్గర్​బహార్​లోని బగ్మారాలో నివసిస్తున్న పహారీ కోర్వా తెగకు చెందిన చంద్రకుమార్ అనే యువకుడు ఈ ఆచారం గురించి ఈటీవీ భారత్​తో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Pahadi Korwa Tribe Unique Tradition
కోర్వా తెగ ఉంటున్న ఇళ్లు (ETV Bharat)

"నా తల్లిదండ్రులు నెల రోజుల క్రితం మరణించారు. వారి మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. ఇంట్లో విషాదకరమైన వాతావరణం నెలకొంది. దీంతో నేను మా ఇంటిని కూల్చివేశాను. మా తల్లిదండ్రుల మరణం తర్వాత నేను చాలా ఇబ్బందులు పడ్డాను. వారి ఆత్మలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. అందుకే ఇల్లును కూల్చేసి మరో ఇల్లును స్థానికుల సాయంతో గడ్డి, కలపతో నిర్మించుకున్నా. ఆ ఇంట్లో నా భార్య, పిల్లలతో జీవిస్తున్నా"

--చంద్రకుమార్, గిరిజనుడు

అశుభంగా భావించి
ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే కోర్వా గిరిజనులు ఇల్లును అశుభమైనదిగా భావిస్తారు. ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయని అనుకుంటారు. వీటన్నింటి నుంచి బయటపడేందుకు ఆ ఇంటిని కూల్చివేసి కొత్త ఇల్లును కట్టుకుని ఉంటారు. చాలా మంది ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా కట్టిన పక్కా ఇళ్లను కూడా వదిలేశారు. 'మేం ఒకే గది ఉన్న ఇంట్లో ఉండేవాళ్లం. అయినా అంతకుముందు మరణించిన మా కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడేవి. అందుకే మేము 12 ఏళ్ల క్రితం నా ఇల్లు కూల్చివేసి మరో ఇంటికి మారిపోయాం.' అని అంజోర్ సాయి అనే వృద్ధుడు తెలిపారు.

Pahadi Korwa Tribe Unique Tradition
ఛత్తీస్​గఢ్​లో ఉన్న కోర్వా తెగ ఇల్లు (ETV Bharat)

'పథకాలన్నీ పట్టణాలకే'
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహతారీ వందన్ యోజన ప్రయోజనాలు తమకు అందడంలేదని వాపోయారు చంద్ర కుమార్. తాను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పటికీ తనకు ఇల్లు కేటాయించలేదని తెలిపారు. మహతారీ వందన యోజన పథకం కింద తన భార్యకు రూ.1000 ఆర్థిక సాయం కూడా అందడం లేదన్నారు. తమకు ప్రభుత్వ ప‌థ‌కాలు అందడం లేదని వాపోయారు. ప‌థ‌కాలన్నీ ప‌ట్ట‌ణాల‌కే అని, పేద‌ల‌కు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pahadi Korwa Tribe Unique Tradition
పహాడా కోర్వా గిరిజనులు (ETV Bharat)

గిరిజన తెగ పేరు జిల్లాకు
కోర్భా జిల్లాను కోర్వా జిల్లా అని కూడా స్థానికులు పిలుస్తారు. కానీ విడ్డూరమేమిటంటే నేటికీ కోర్వా గిరిజనులు అత్యంత వెనుకబడి ఉన్నారు. కుటుంబ సభ్యులు చనిపోతే ఇంటిని విడిచిపెట్టే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. వారి సంచార జీవనశైలి కారణంగా, వారు ఇప్పటికీ అడవుల్లో నివసిస్తున్నారు. అయితే, కొండప్రాంతాల్లో నివసించే కొందరు కోర్వా గిరిజనులను ప్రభుత్వం కిందకు తీసుకొచ్చింది. వారి కోసం వారి కోసం మౌలిక వసతులు కల్పించింది. అయినప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా చాలా అడవుల్లోనే ఉండిపోతున్నారు.

తాజ్​ హోటల్​, ఎయిర్​పోర్ట్​కు బాంబ్​ బెదిరింపులు- ప్రయాణికులను దించేసిన సిబ్బంది- టెన్షన్​ టెన్షన్​ - bomb threat airport today

'ఫేస్​బుక్​లో లైవ్ చేస్తే ప్రజలు ఓటేయరు- రాష్ట్రంలో ఈసారి 40కి పైగా సీట్లు పక్కా!'- ఈటీవీ భారత్​తో సీఎం​ శిందే - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.